e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌
  • అందాల ప్రపంచం.. అవకాశాల లోకం
  • మోడలింగ్‌లో అదరగొడుతున్న నగరభామలు
  • సిటీలో సుమారు 45 వేల మంది మోడల్స్‌
  • బ్రాండ్స్‌ ప్రమోట్‌లో ఆ అతివలదే ప్రత్యేక ఆకర్షణ
  • కొవిడ్‌ తగ్గడంతో మళ్లీ షురువైన ఫ్యాషన్‌ సందడి

‘వ్యయారి భామ.. నీ హంస నడక.. అందమైన భామలు.. లేతమెరుపు తీగలు’.. ఈ సినీ చరణాలు వింటుంటే..మనకు ఫ్యాషన్‌ షోలు.. ఈవెంట్స్‌ల్లో క్యాట్‌వాక్‌ చేసే మోడల్స్‌ గుర్తుకు వస్తారు. ఆకట్టుకునే కండ్లతో.. చిట్టిచిట్టి అడుగులతో వీక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ భామలకు.. తమ శరీర ఆకృతియే అవకాశాలు మోసుకొచ్చే పల్లకి. నోరును కట్టుకుని.. ఫిజిక్‌పై దృష్టిపెడుతూ ప్రతీరోజు సౌందర్యంగా నిలవడానికి నిత్యయుద్ధమే చేస్తారు. తమ అందచందాలతో ప్రాడక్ట్స్‌, షోరూంల ప్రారంభోత్సవాలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వయ్యా రంగా కదులుతూ.. బ్రాండ్స్‌ ప్రమోట్‌ చేయడంలో హోయలుపోతారు. నగరంలో ఏ షాపు ఓపెన్‌ చేయాలన్నా.. జ్యువెల్లరీ ఆవిష్కరించాలన్నా.. ఎలాంటి వ్యాపార కార్యక్రమమైనా.. అందులో ఆ మగువలు లేకుండా ఫంక్షన్లు బోసిపోవాల్సిందే. అంతలా వారి మార్క్‌ ఉంటుంది. మొన్నటి వరకు మోడలింగ్‌పై కరోనా పెను ప్రభావం చూపింది. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో మోడళ్ల సందడి మళ్లీ షురువైంది.

అభినయం.. సమయస్ఫూర్తి

నగరంలో సుమారు 45 వేల మంది మోడలింగ్‌లో ఉన్నారు. అందులో పురుషులు 12 వేల మంది. ఒక్కో కార్యక్రమానికి 3 నుంచి 5 నిమిషాల మోడలింగ్‌ చేయాలంటే స్టార్‌డమ్‌ను బట్టి రూ. 5వేల నుంచి రూ. 50 వేల వరకు చార్జీ చేస్తున్నారు. ఇక సినీ, సీరియల్‌ సెలబ్రిటీలు మోడలింగ్‌ చేస్తే చార్జీ లక్షపైనే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కొందరు సీనియర్‌ మోడల్స్‌ సొంతంగా ఇనిస్టిట్యూట్స్‌ ఏర్పాటు చేసుకుని యువతులకు ట్రైనింగ్‌ ఇస్తున్నారు. మోడలింగ్‌లో నిలదొక్కుకోవాలంటే.. క్యాట్‌వాక్‌, డ్రెస్స్‌ మెయింటెన్‌, లాంగ్వేజ్‌, డైట్‌, వ్యాయామం, స్మైల్‌, చూపు, ప్రతిభ, విజ్ఞానం, అభినయంతో పాటు సామాజిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. కాంపిటేషన్స్‌ల్లో జడ్జీలు ఇచ్చే టాస్క్‌లకు సరైన సమాధానం.. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవాలి. నగరంలో కొవిడ్‌కు ముందు సుమారు 70కిపైగా ఈవెంట్స్‌ జరిగేవి. సుమారు 20వేల మంది మోడల్స్‌కు ఉపాధి దొరికేది. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ ఫ్యాషన్‌ కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి.

అందాల పోటీలకు వడివడిగా అడుగులు..

- Advertisement -

మిస్‌ ఇండియా.. మిస్‌ వరల్డ్‌…. మిసెస్‌ ఏషియా..మిసెస్‌ ఇండియా.. మిస్‌ టీన్‌ యూనివర్స్‌..ఇలా ఎన్నో టైటిళ్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో ఉన్నాయి. ఈ కిరీటాలను గెలుచుకోవడానికి లక్షలాది మంది యువతులు తహతహలాడుతారు. ప్రతి నలుగురిలో ఇద్దరు అమ్మాయిలు ఫ్యాషన్‌ ప్రపంచంలో తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తారు. కాలేజీ నుంచే ఆ పోటీల్లో తమ లక్ష్యానికి బాటలు వేసుకుంటారు. కఠోర శ్రమ చేస్తూ తమ దేహా దారుఢ్యాన్ని అందంగా మలుచుకుంటారు.

సహనం చాలా ముఖ్యం

మూడేండ్ల నుంచి మోడలింగ్‌లో ఉన్నాను. మోడలింగ్‌లో రాణించాలంటే ఫిట్‌నెస్‌తో పాటు సరైన ఆటిట్యూడ్‌, సహనం చాలా ముఖ్యమని గుర్తించాను. కేవలం ప్రతిభ ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు లక్కుపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతీ ప్రోగ్రాం మనకో పరీక్షయే. కేవలం ఆ బ్రాండ్‌ ప్రమోట్‌ కోసమే మనం ప్రోగ్రాం చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్లు చాలా మంది వీఐపీలు ఉంటారు. వారిలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉంటారు. చెప్పలేం ఎప్పుడు ఎలాంటి అవకాశం తలుపుతడుతుందో.. -సమన రాణా, మోడల్‌

క్రమశిక్షణ అవసరం..

చాలా మందికి మోడలింగ్‌ అంటే శరీరాకృతియే అనుకుంటారు. కానీ మోడలింగ్‌లో అదొక్కటే ముఖ్యమైనది కాదు. భాష మీద పట్టు, విషయ పరిజ్ఞానం, నిత్యం యాక్టివ్‌గా కనిపించే రూపం కూడా అవసరమే. నేను 8 ఏండ్ల నుంచి ఈ రంగంలో ఉన్నాను. అనేక సినిమాలు, సీరియల్స్‌, షూట్స్‌ చేశాను. కరోనాతో నా అవకాశాలు కొంచెం తగ్గాయి. మళ్లీ ఇప్పుడు అవకాశాలు
మొదలయ్యాయి. – సరిత, మోడల్‌

మన శరీరమే గొప్ప ఆస్తి

మోడలింగ్‌ అనేది అనేక అవకాశాలను అందించే వేదికగా భావిస్తాను. అందాల ఆరబోతనే మోడలింగ్‌ అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ అది అవగాహన లేని వారి భావన. మన శరీరాన్ని మనం ప్రేమించగలిగితే మోడలింగ్‌లో రాణించినట్టే. మన శరీరమే మన గొప్ప ఆస్తి. నేను 5 ఏండ్ల నుంచి ఈ రంగంలో ఉన్నాను. ఎలాంటి అవరోధాలు ఎదురైనా.. మన లక్ష్యం నుంచి పారిపోకూడదు. కొవిడ్‌ పరిస్థితులు ఇబ్బందులు కల్పించినా.. సోషల్‌ మీడియాతో చాలా ప్రోగ్రాంలు చేశాం. ఇప్పుడు మళ్లీ నగరంలో మోడలింగ్‌ జోష్‌ మొదలైంది. – చందన, మోడల్‌

హార్డ్‌వర్క్‌తోనే విజయాలు

మోడలింగ్‌లో రాణించాలని చాలా మంది యువతులకు ఆశగా ఉంటుంది. కానీ ఎక్కువ కాలం ఉండలేక ఇతర వ్యాపారాల్లోకి వెళ్లిపోతారు. ఒకే రోజు సక్సెస్‌ రాదు. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. మన హార్డ్‌వర్క్‌యే మనకు విజయాన్ని అందిస్తుందని నమ్మాలి. చాలా మంది అమ్మాయిలకు నేనే ట్రైనింగ్‌ ఇస్తున్నాను. సామాజిక అవసరాల కోసం కొన్నిసార్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా మోడలింగ్‌ చేస్తాం. – సుధా జైన్‌, ప్రముఖ మోడల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌
లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌
లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

ట్రెండింగ్‌

Advertisement