సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Jul 16, 2020 , 22:46:15

దవాఖానల్లో బెడ్లు లేవంటూ ట్విట్టర్‌లో అసత్య ప్రచారం

దవాఖానల్లో బెడ్లు లేవంటూ ట్విట్టర్‌లో అసత్య ప్రచారం

-కొవిడ్‌ బాధితులను భయాందోళనకు గురిచేసేలా పోస్టులు

-బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు 

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : కరోనా బాధితులకు దవాఖానల్లో బెడ్లు లేవంటూ సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా కార్తీక్‌ అనే వ్యక్తి పేరుతో ఉన్న ట్విట్టర్‌ ఖాతా నుంచి కొన్ని పోస్టులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో, విరించి, యశోద, స్టార్‌ తదితర కార్పొరేట్‌ దవాఖానల్లో కొవిడ్‌ బాధితులకు సరిపడా బెడ్లు లేవని, రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని పోస్టులు పెట్టడంతో పాటు తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌, సీపీ, మంత్రి కేటీఆర్‌ తదితరులకు ట్యాగ్‌ చేయడం ప్రారంభించాడు. సదరు వ్యక్తి ఎవరనే విషయాన్ని ఆరా తీయగా అకౌంట్‌కు సంబంధించిన వివరాలు లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు వీటిని పెడుతున్నారని తేలిందని పోలీసులు  పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు తీవ్రమైన భయభ్రాంతులకు గురవుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఫేక్‌ పోస్టులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ కానిస్టేబుల్‌ రామ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 188, సెక్షన్‌ 54 ఆఫ్‌ డీఎంఏ, సెక్షన్‌ 3 ఆఫ్‌ ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 66 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.