శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Sep 12, 2020 , 04:28:28

తప్పుడు కేసు పెట్టి, బ్లాక్‌మెయిల్‌.. ఇద్దరిపై కేసు

తప్పుడు కేసు పెట్టి, బ్లాక్‌మెయిల్‌.. ఇద్దరిపై కేసు

బంజారాహిల్స్‌ : తప్పుడు కేసు పెట్టించడంతో పాటు డబ్బుల కోసం బెదిరింపులకు గురిచేస్తున్న ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లో నివాసముంటున్న జి.సతీశ్‌ అనే యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఏడాది క్రితం అతడి ఇంట్లో మధులత అనే యువతి అద్దెకు దిగింది. నాలుగునెలల క్రితం సతీశ్‌ వద్దకు వచ్చిన మధులత.. తన బాయ్‌ఫ్రెండ్‌ గణేశ్‌ దాడి చేస్తున్నాడని, తరచూ కొడుతున్నాడని, సాయం చేయాలని కోరింది. దీంతో గణేశ్‌ను పిలిపించి పద్ధ్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న గణేశ్‌.. తనపై కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతో మధులతతో తప్పుడు ఫిర్యాదు చేయించాడని, ఈ కేసులో రాజీ కుదుర్చుకోవాలంటే రూ.90వేలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో పాటు తన కారును లాక్కుని వెళ్లాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులు గణేశ్‌, మధులతపై కేసు నమోదు చేశారు.