మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 13, 2020 , 07:16:19

నకిలీ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు..

నకిలీ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు..

మేడిపల్లి: నేపాలీ యువతులు, మహిళలనే టార్గెట్‌ చేసుకుని... విదేశాల్లో మంచి ఉద్యోగాలు, ఎక్కువ  జీతాలు ఇప్పిస్తామని నమ్మించి.. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడిపల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 7 ఇండియన్‌, 2 నే పాలీ పాస్‌పోర్ట్స్‌, 4 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మల్నాజిగిరి జోన్‌ డీసీపీ రక్షిత కె మూర్తి.. ఏసీపీ నర్సింహరెడ్డి, సీఐ అంజిరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. కరీంనగర్‌ ధర్మపురి గ్రామానికి చెందిన ద్యావల్ల నరేశ్‌ (29), కోస్న తిరుపతి (29) స్నేహితులు. అయితే సులువుగా డబ్బులు సంపాదించేందుకు పలువురిని మోసం చేయాలనుకున్నారు.


 ఇందులో భాగం గా బోడుప్పల్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని ఇందిరా అపా ర్టుమెంట్‌లో ఫ్లాట్‌ తీసుకున్నారు. మేరీ హాలీడేస్‌ పేరుతో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి.. అందులో విదేశాల్లో( గల్ఫ్‌) సూపర్‌వేజర్లు, లేబర్‌ తదితర ఉద్యోగాలతో పాటు ఎక్కువ జీతాలు ఇప్పిస్తామని ప్రకటనలు చెట్టారు. ఈ పకటనలు నమ్మి వచ్చే నేపాలీకి చెందిన యువతులు,  మహిళలకు.. ఇరాక్‌, దుబాయ్‌ లాంటి అరబ్‌ దేశాలకు పంపిస్తామని న మ్మిస్తారు. పాస్‌పోర్టులు ఏర్పాటు చేసి.. నకిలీ వీసాలు తయారు చేసి ఢిల్లీ నుంచి ఇరాక్‌ వయా దుబాయ్‌కు పంపిస్తున్నారు. నగరంతోపాటు ఇతర రాష్టాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా ఈ దందా నడిపిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 మంది మహిళలను పంపించారని సమాచారం. వారు ఉద్యోగాల్లో చేరగానే.. ఒక్కొక్కొరు రూ.15వేల చొప్పున వీరికి పంపిస్తారు. ఇ లా కొన్నాళ్లుగా ఈ దం దా నడిపిస్తున్నారు. 


  దీనిపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు  బోడుప్పల్‌లోని కార్యాలయంపై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులతోపాటు  ఐదుగురు నేపాలీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితు లు నరేశ్‌, తిరుపతిలను రిమాండ్‌కు తరలించగా.. నేపాలీ మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. గతంలో వీరు దిల్‌సుఖ్‌నగర్‌లో నకిలీ వీసాల కార్యాలయం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి బోడుప్పల్‌కు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. 


logo
>>>>>>