సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): రోడ్డు మీద సిమ్ దొరికింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీ తెరిచి అమ్మాయిలను టార్గెట్ చేశాడు. పోలీసులకు దొరకకుండా సిమ్‌ను ధ్వంసం చేసి.. ఫోన్‌ను ఫార్మాట్ చేశాడు. అయినా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్, హనుమాన్‌నగర్, కొత్త చెరువు ప్రాంతానికి చెందిన అక్షయ్‌కుమార్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో అతనికి రోడ్డుపై ఓ సిమ్‌కార్డు దొరికింది.
వెంటనే దాన్ని తన ఫోన్లో వేసుకున్నాడు.. ఆ సిమ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీని సృష్టించాడు. ఆ తర్వాత సిమ్‌ను ధ్వంసం చేశాడు. సిమ్ ధ్వంసమైన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఐడీ పని చేస్తుండటంతో దానితో అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఐడీలను సేకరించి.. వారికి నగ్న ఫొటోలు, శృంగారానికి సంబంధించిన చాట్లను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఇలా ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సాంకేతిక ఆధారాలను సేకరించి మంగళవారం నిందితుడు అక్షయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో.. పోలీసులకు తన ఆచూకీ దొరకకుండా ఉండేందుకు సిమ్‌ను ధ్వంసం చేసి.. ఫోన్‌ను ఫార్మాట్ చేశాడని తెలిసింది.