గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:39:32

ఠాణా పేరుతో నకిలీ ఎఫ్‌బీ

ఠాణా పేరుతో నకిలీ ఎఫ్‌బీ

అర్జంట్‌గా డబ్బులు పంపాలంటూ మెసేజ్‌లు

సకాలంలో గుర్తించి.. సీసీఎస్‌ పోలీసులకు సమాచారం

ఉస్మానియా యూనివర్సిటీ : లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా ఓపెన్‌ చేసి.. అర్జంట్‌గా డబ్బులు పంపాలంటూ మెసేజ్‌ లు పెట్టి అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్‌ చీటర్లు యత్నిం చారు. అయితే.. సకాలంలో గుర్తించిన సీఐ శ్రీనివాస్‌.. సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ వివరాల ప్రకారం... లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌కు అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. అదే పేరుతో ఒక నకిలీ ప్రొఫైల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు రూపొందించారు. అసలు ఖాతాలో ఉన్న వ్యక్తులందరికీ నకిలీ ఖాతా ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించారు. దాన్ని అంగీకరించిన వారికి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా తెలిసిన వ్యక్తిలా రెండు నిమిషాలు చాట్‌ చేసి.. తనకు అత్యవసరంగా రూ.10 వేలు అవసరం ఉంద ని, తక్షణమే ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పంపాలని కోరారు. కొంతమంది అనుమానం వచ్చి సీఐకి ఫోన్‌ చేయగా.. ఆయన ఎవరికీ డబ్బులు పంపవద్దని సూచించారు.  అనంతరం ఇన్‌స్పెక్టర్‌ సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందించి, నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిలో కొంతమంది విలేకరులు ఉండటం విశేషం.

 

logo