e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు

హైదరాబాద్‌: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై మరో కేసు నమోదయ్యింది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్‌, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది. అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి ఈనెల 1న నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్‌ ఇచ్చిన దవాఖానలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్‌, రత్నాకర్‌, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.

ఇవి కూడా చదవండి..

బాలీవుడ్ లెజెండ్ దిలీప్‌ కుమార్ ఇక లేరు
దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం
దిలీప్ కుమార్ క‌న్నుమూత‌.. ఒక శ‌కం ముగిసిందంటూ సెల‌బ్స్ ట్వీట్స్
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ హతం
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
యూరో కప్‌-2020 ఫైనల్‌కు చేరిన ఇటలీ
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana