బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 07:34:19

ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ

ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ

హైదరాబాద్ : ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా మరింత అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని, అత్యాధునిక సాంకేతిక అంశాలపై మెళకువలు నేర్పాలని ఎయిర్‌ మార్షల్‌ ఆర్డీ మాథుర్‌ సూచించారు. భారత వాయుసేన శిక్షణ దళానికి కమాండింగ్‌ చీఫ్‌గా ఉన్న మాథూర్‌.. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళ, బుధవారాల్లో దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీని సందర్శించారు. శిక్షణ సిబ్బంది, ట్రైనీ అధికారులతో సమావేశమయ్యారు. సాంకేతికంగా ఇస్తున్న శిక్షణపై ఆయన సమీక్షించారు. 


logo