ఎక్స్ ఆఫీషియోల లెక్క తేల్చే పనిలో బల్దియా

- జీహెచ్ఎంసీకి చేరిన సభ్యుల జాబితా
- మేయర్ ఎన్నిక ప్రక్రియకుకసరత్తు ముమ్మరం
- ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్?
సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ ) : మరో పద్నాలుగు రోజుల్లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలక వర్గం కొలువుదీరనున్నది. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. 11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి ఇప్పటికే ప్రతిపాదించారు. గతంలో లాగానే సమయభావం దృష్ట్యా సభ్యులందరూ సామూహిక ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే కీలకమైన ఎక్స్ ఆఫీషియో సభ్యుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది బల్దియా. పురపాలక శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న జీహెచ్ఎంసీ.. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్ ఆఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలను సేకరిస్తున్నది. ఇక శాసససభ కార్యదర్శి నుంచి ఎమ్మెల్సీ వివరాలను తీసుకున్న అధికారులు.. వీరికి జీహెచ్ఎంసీలో ఓటు ఉందా? లేదా? ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీల్లో ఎంత మందికి గ్రేటర్లో ఓటు హక్కు ఉందన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఎక్స్ ఆఫీషియో జాబితా తుది రూపు తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- బెంగాల్ పోలింగ్‌పై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!
- శ్రీవారి సేవలో ఏ1 ఎక్స్‌ప్రెస్ టీమ్
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్‌కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
- కరోనా టీకా తీసుకున్న పరేష్ రావల్
- భార్యకు టీఎంసీ టికెట్.. హౌరా ఎస్పీని తొలగించిన ఈసీఐ