శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Jul 05, 2020 , 23:15:17

పేదల గుడిసెల్లో విద్యుత్‌ కాంతులు

పేదల గుడిసెల్లో విద్యుత్‌ కాంతులు

‘అంబేద్కర్‌ హట్స్‌'లో మీటర్ల బిగింపునకు  గ్రీన్‌ సిగ్నల్‌

మంత్రుల చొరవతో తొలిగిన అడ్డంకులు

ఫలించిన ఎమ్మెల్యే, బోర్డు  ఉపాధ్యక్షుడు, బోర్డు సభ్యురాలి కృషి 

హర్షం వ్యక్తం చేస్తున్న బస్తీవాసులు

కంటోన్మెంట్‌: వాళ్లంతా రెక్కాడితే గాని డొక్కాడని పేద లు. ఉన్న ఊరును విడిచి బతుకు దెరువు కోసం పొట్ట చేత బట్టుకుని నగరానికి వలస వచ్చిన  నిరుపేదలు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని మడ్‌ఫోర్ట్‌ ప్రాంతంలో 40 ఏండ్లుగా  చెత్తకుప్పలు, మురుగునీరు మధ్య తాగునీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలు లేకుండా వారు దుర్భర జీవితాన్ని  గడుపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సాయన్న ప్రత్యేక చొరవ తీసుకుని అప్పటి తహసీల్దార్‌తో మాట్లాడి  అర్హత ఉన్న గుడిసెవాసులకు  రేషన్‌, ఓటరు,  ఆధార్‌కార్డులు, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు అందేలా కృషి చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌,టీడీపీలు వీరిని  ఓటర్లుగానే చూశారే తప్పా ప్రజలుగా ఏనాడూ గుర్తించలేదు. సీఎం కేసీఆర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని గుడిసె వాసుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మడ్‌ఫోర్ట్‌ అంబేద్కర్‌ హట్స్‌గా పేరుగాంచిన ఈ బస్తీలోని ఉన్న ఆరువందల మంది గుడిసె వాసుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సాయన్నతో పాటు అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు సభ్యురాలు అనితాప్రభాకర్‌ 2017లో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో వారి గుడిసెలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడంపై హామీ లభించింది. అనుకున్నదే తడువుగా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో విద్యుత్‌ అధికారులు ప్రతి గుడిసెకు విద్యుత్‌ మీటర్‌ను మంజూరు చేశారు. తొలి విడుతలో 250 గుడిసెలకు మీటర్లు మంజూరు చేశారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు డిఫెన్స్‌ ఎస్టేట్‌ అధికారులతో కలిసి  కుట్ర పూరితంగా వ్యవహరించడంతో రక్షణశాఖ అధికారులు  సీఎండీకి లేఖ రాయడంతో తాత్కాలికంగా మీటర్ల బిగింపు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. దీంతో గుడిసె వాసుల వెలుగులకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన సందర్భంలో గుడిసె వాసుల విద్యు త్‌ మీటర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విద్యుత్‌ మీటర్ల బిగుంపునకు అడ్డంకిగా మారిన అంశాలను ఎమ్మెల్యే సాయన్న, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు సభ్యురాలు అనితాప్రభాకర్‌ మళ్లీ మంత్రులు తలసాని, మల్లారెడ్డికి వివరించారు.

   తక్షణమే విద్యుత్‌ మీటర్ల అంశంపై దృష్టి పెట్టి డిఫెన్స్‌ అధికారులతో మాట్లాడి త్వరలోనే మీటర్ల బిగుంపు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ విద్యుత్‌ మీటర్ల బిగుంపు ప్రక్రియ మొదలుకావడంతో గుడిసెవాసుల్లో ఆనందం వ్యక్తమవుతు న్నది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకోవడం తో ఇన్నాళ్లు చీకట్లలో మగ్గిన తమ జీవితాలు  వెలుగులతో విరజిమ్మనున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

గుడిసెల్లో వెలుగులు నింపుతాం

ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం లభించింది. అంబేద్కర్‌ హట్స్‌లో విద్యుత్‌ వెలుగుల కోసం నిరంతరం ఎమ్మెల్యే సాయన్నతో కలిసి కృషి చేశాం. ప్రతి సమావేశం లో డిఫెన్స్‌ అధికారులతో మా ట్లాడుతూ అడ్డంకులు తొలిగించే విధంగా కృషి చేశాం. అదే విధంగా మంత్రుల చొరవ మరువలేనిది. ప్రతి గుడిసెకు విద్యుత్‌ మీటర్ల బిగింపే కాకుండా, ప్రతి పథకం గుడిసెవాసులకు అందేలా చర్యలు చేపడుతాం. వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. 

        - జె.రామకృష్ణ, ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్‌ బోర్డు

సంతోషంగా ఉంది 

త్వరలో అంబేద్కర్‌ హట్స్‌లోని ఇండ్లలో విద్యుత్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ మొదలుకానుండడంతో సంతోషంగా ఉంది. విద్యుత్‌ సదుపాయం కల్పించడంలో ఎమ్మెల్యే సాయన్న, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, స్థానిక బోర్డు సభ్యురాలు అనితాప్రభాకర్‌ కృషి మరువలేనిది. తమ బాగోగులు చూసుకుంటూ మార్గనిర్దేశం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తుండడంతో అంబేద్కర్‌ హట్స్‌లోని స్థానికుల తరఫున కృతజ్ఞతలు. ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడానికి కృషి చేసిన వారికి రుణ పడి ఉంటాం.

             - సాంబ అశోక్‌, అంబేద్కర్‌ హట్స్‌ నివాసి