మంగళవారం 26 మే 2020
Hyderabad - May 21, 2020 , 00:13:07

మండువేసవిలో.. మైనస్‌ కరెంట్ బిల్లులు

మండువేసవిలో.. మైనస్‌ కరెంట్ బిల్లులు

చందానగర్‌ : గత వేసవి లో వేలు, లక్షల్లో వచ్చిన కరెంటు బిల్లులకు  తాజాగా వచ్చిన బిల్లులకు చాలా తేడా కనిపిస్తున్నది. మార్చిలో వాడిన విద్యుత్‌కు ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ కారణంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ సేకరించే పరిస్థితి లేనందున గతేడాది ఏప్రిల్‌లో వచ్చిన బిల్లు మొత్తాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఈ ఏడాది అంత పెద్దమొత్తంలో విద్యుత్‌ వినియోగం జరగలేదు. తాజాగా తారానగర్‌ సెక్షన్‌ పరిధిలో అధికారులు ప్రయోగాత్మకం గా దాదాపు 500లకుపైగా వినియోగదారుల మీటర్ల రీడింగ్‌ సేకరించారు.  దీంతో గత నెల లో పెద్ద మొత్తంలో చెల్లించిన వారికి మైనస్‌ బిల్లులు వచ్చాయి. 

 క్రమబద్ధీకరణ  ఇలా..

చందానగర్‌కు చెందిన పాండురంగారెడ్డి కమర్షియల్‌ కనెక్షన్‌లో ఏప్రిల్‌లో ఎలాంటి విద్యు త్‌ వాడకం జరుగలేదు. అయినా గత నెలలో వారు పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించగా ఈ నెల బిల్లులో రూ.10,151 అడ్జస్ట్‌ చేసి తాజా గా మైనస్‌ రూ.9,515 బిల్‌ అందజేశారు. 

చార్జీలు నామమాత్రమే..

 కమర్షియల్‌ కనెక్షన్‌దారులకు వ్యాపారం బంద్‌ ఉన్న నేపథ్యంలో నామమాత్రపు చార్జీలు వేయడంతో బిల్లుల్లో ఆ మొత్తం మైనస్‌గా ధ్రువీకరిస్తాం. ఆ మొత్తాన్ని రానున్న నెలల్లోని బిల్లుల్లో అడ్జస్ట్‌ చేస్తాం. ఈ క్రమంలోనే వినియోగదారులంతా బిల్లులు పెండింగ్‌ ఉంచకుండా సకాలంలో చెల్లించాలి. ఎక్కువ, తక్కువైనా వచ్చేనెల బిల్లుల్లో క్రమబద్ధీకరిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

- రవిచంద్ర, తారానగర్‌ ఆపరేషన్స్‌ ఏఈ


logo