గ్రేటర్లోఎన్నికల హీట్

- జీహెచ్ఎంసీలోమొత్తం వార్డులు150
- వలంటీర్లను ఎంపిక చేసే ప్రక్రియలో బల్దియా
- ఈ నెల 7న ముసాయిదా ఓటర్ల జాబితా
- 150 వార్డులకు ఆర్వోలు, ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలు
- ఒక్కో వార్డుకు 50 పోలింగ్ కేంద్రాలు
- ఏపీ నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులు 28,683
- 8 నుంచి 11 వరకు అభ్యంతరాల స్వీకరణ
- 30 మంది డిప్యూటీకమిషనర్లకూ ఎన్నికల విధులు
- లైవ్ వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు
- నాగర్ కర్నూల్ నుంచి మరో 800
- 13న తుది ఓటరు జాబితా ప్రచురణ
- నిర్వహణబాధ్యత మొత్తం రిటర్నింగ్ అధికారిదే
- ప్రతి వార్డులో ఒక పోలింగ్ స్టేషన్‌ను ఎంపిక చేసి ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను వినియోగిస్తారు.
- బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు
- 15 కల్లా సిద్ధం చేయాలని నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లుగానే తెలుస్తున్నది. మరో 10 రోజుల తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఓటర్ల జాబితాపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఈసీ.. ఈ నెల 7న ముసాయిదా ఓటరు జాబితాను జారీ చేయనున్నది. 13న తుది ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత ఎప్పుడైనా బల్దియా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ వల్ల రిజర్వేషన్లు, డివిజన్లలో మార్పు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ తక్కువ సమయంలో చేపట్టే అవకాశం ఏర్పడింది.
బల్దియా ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ నుంచి 28,683 తెప్పించారు. నాగర్‌కర్నూలు నుంచి మరో 800 బాక్సులు రానున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో భద్రపరిచిన వీటికి మరమ్మతులు చేసి ఈ నెల 15 లోగా అందుబాటులోకి తేవాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌కు అవసరమైన వలంటీర్ల నుంచి జీహెచ్ఎంసీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా బ్యాలెట్ బాక్స్‌లను మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. దీనికోసం టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 15వ తేదీకల్లా వాడకానికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఓటింగ్ యంత్రాలు వచ్చిన తరువాత బ్యాలెట్ బాక్సుల ఉపయోగం తగ్గిపోవడంతో అవి పాడైపోయాయి. కొవిడ్ నేపథ్యంలో వచ్చే బల్దియా ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఏపీలో పలుజిల్లాల నుంచి 28683బాక్సులను తెప్పించి చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో భద్రపరిచారు. మరో 800బాక్సులు నాగర్‌కర్నూల్ నుంచి తెప్పిస్తున్నారు. ఈ బాక్సులు రంగుపోయి పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉండడంతో వాటిని మరమ్మతు చేయించాలని నిర్ణయించారు.
వెబ్ కాస్టింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికల సందర్భంగా లైవ్ వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఆసక్తి గల వలంటీర్లు http: //bit.ly/GHMCELECTIONS-2020 అనే వెబ్ లింకు ద్వారా, లేక జీహెచ్ఎంసీ వెబ్సైట్, లేక మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమిషనర్ లోకేశ్‌కుమార్ నేడొక ప్రకటనలో కోరారు. విద్యార్థులు తమ లాప్‌టాప్‌లతో ఎన్నికల రోజు, అలాగే ప్రీపోల్కు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. వలంటీర్లు గంటపాటు ఉండే శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని, అలాగే ప్రీపోల్ రోజున మెటీరియల్ తీసుకునేందుకు రావాల్సి ఉంటుందని, అనంతరం పో లింగ్రోజు రావాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణతోపాటు హాజరు కావాల్సి న సమయాన్ని అనంతరం తెలియజేస్తామన్నారు. గౌరవమొత్తాన్ని చెల్లించడంతోపాటు సర్టిఫికెట్‌ను అందజేస్తామన్నారు. సందేహాలకు ghmcelections 20 [email protected]కు మెయిల్ చేయాలని కమిషనర్ విజ్ఞప్తిచేశారు.
తాజావార్తలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
- భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సిఫారసు
- వ్యాపార రంగంలో లాభాలు.. రుణ ప్రయత్నాలు