సోమవారం 01 మార్చి 2021
Hyderabad - Sep 08, 2020 , 00:46:35

ఎల్బీనగర్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఎల్బీనగర్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యం

వనస్థలిపురం : ఎల్బీనగర్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్‌లో రూ. 2.67కోట్లతో అభివృద్ధి పనులను కార్పొరేటర్‌ రమావత్‌ పద్మానాయక్‌తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రఘుమారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, సత్యం చారి, సయ్యద్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo