శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 07:17:52

పీఆర్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.. మంత్రి ఎర్రబెల్లి

పీఆర్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.. మంత్రి ఎర్రబెల్లి

సుల్తాన్‌బజార్‌: పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌  దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హమీ ఇచ్చారు. మంగళవారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌, ప్రతాప్‌,మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మంత్రి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘానికి నూతనంగా ఎన్నికైన వారిని మంత్రి అభినందించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు  పంచాయతీరాజ్‌ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు,ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.ఇందుకు మంత్రి స్పందిస్తూ టీఎన్జీవో కేంద్ర సంఘానికి సంపూర్ణ సహకారం ఉంటుందని నేతలకు హామీనిచ్చారు.logo