బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:27:47

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి

మేడిపల్లి : పీర్జాదిగూడ నగరపాలకలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నగరపాలక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో కార్పొరేటర్ల సమక్షంలో ఏకగ్రీవంగా నగరపాలక పార్టీ నూతన కమిటీని మేయర్‌ ప్రకటించారు. నగరపాలక పార్టీ అధ్యక్షుడుగా దర్గ దయాకర్‌ రెడ్డి, నగర కార్యనిర్వహక అధ్యక్షుడుగా కోటగిరి శ్రీకాంత్‌ గౌడ్‌, ఏనుగు మనోరంజన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా బండి శ్రీను, బండి శ్రీరాములు, మోహన్‌రెడ్డి, శ్యామ్‌గుప్తా, బాలనర్సింహ, నరేందర్‌, శ్రీకాంత్‌రెడ్డి, కాటపాక కుమార్‌, రామకృష్ణ, జావిద్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శిగా సుక్క జయేందర్‌, రఘువర్ధన్‌ రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మల్లికార్జున్‌, జిట్ట చంద్రశేఖర్‌, నర్సింహరావు, శంకరాచారి, జాయింట్‌ సెక్రటరీలుగా పాండు గుప్తా, విజయ్‌, రాజు, కమల్‌, పురుషోత్తం, సతీశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కోశాధికారిగా సీహెచ్‌ సంపత్‌, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, నర్సింగరావు, వెంకట్‌రావు, ప్రవీణ్‌కుమార్‌, విద్యాపాగర్‌, లక్ష్మయ్య, నర్సింహచారి, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా నిర్మల, ప్రధాన కార్యదర్శిగా సావిత్రి, ఉపాధ్యక్షురాలుగా మానస, ఇందిర, పద్మ, లక్ష్మి, అనురాధ, ఆర్గనైజర్‌ సెక్రటరీగా రమాదేవి, అంజలి, జాయింట్‌ సెక్రటరీగా బుజ్జి, సువర్ణ, కార్యవర్గ సభ్యులుగా జ్యోతి, స్వరూప, భూలక్ష్మి, చంద్రకళ, రమాదేవి, సరళ, అనిత, అరుణ, బాలామణి, శ్రీలత, భవిత తదితరులను నియమించినట్లు తెలిపారు. అనంతరం ఆయన కమిటీ సభ్యులకు మొక్కలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్‌నాయక్‌, హరిశంకర్‌రెడ్డి, అనంతరెడ్డి, యుగేందర్‌రెడ్డి, బండి రమ్య సతీశ్‌గౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు, నాయకులు పప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు.


logo