బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Aug 31, 2020 , 23:33:21

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

 శ్రీనగర్‌కాలనీ:  వేంకటేశ్వర ఆలయాభివృద్ధికి ధర్మకర్తల మండలి కృషి చేయాలని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కోరారు. సోమవారం శ్రీనగర్‌కాలనీలోని ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే సమక్షంలో దేవాలయ నూతన ధర్మకర్తల పాలక మండలి ప్రతినిధులతో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. ధర్మకర్తలు సంతోష్‌కుమార్‌, నర్సింగ్‌రావు, సంతోష్‌గౌడ్‌, రామయ్య, వెంకటచలమయ్య, మోహన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, సుబ్బారెడ్డి, సత్యసాయికుమార్‌, సాంబశివరావు, హరిప్రసాద్‌, అరుణ, ఆదిలక్ష్మి ఎక్స్‌అఫిషియే సభ్యుడిగా నియమితులైన ఆలయ ప్రధాన అర్చకుడు మురళీ చైర్మన్‌గా సుజాతను ఎన్నుకున్నారు. చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన సుజాతను ఎమ్మెల్యే గోపినాథ్‌ అభినందించారు. ప్రభుత్వం నుంచి తమవంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ఈవో రామాంజనేయులు, ఆలయ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.