బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 19, 2020 , 00:28:18

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

అబిడ్స్‌ : వాణిజ్య పన్నుల శాఖలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవో సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సోమేశ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలోని సమస్యలను పరిష్కరించి,ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖను పునర్‌వ్యవస్థీకరించి నూతన పోస్టులు, నూతన సర్కిళ్లు మంజూరు చేయడంపై సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌,అసోసియేట్‌ అధ్యక్షుడు ఎండీ.రహమత్‌అలీ, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్‌రావు, సంయుక్త కార్యదర్శి ఆముదం, నగర డివిజన్ల అధ్యక్షుడు శ్రీనివాస్‌ప్రసాద్‌, మాలిక్‌, స్వామి, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo