బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Sep 16, 2020 , 01:10:23

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. కాచిగూడ డివిజన్‌లోని నారాయణగూడ, కిషోర్‌ టాకీస్‌ లేన్‌లో రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకన్నతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో ప్రజల అవసరాలకనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్‌లో పాదయాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. చాలా ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీనివాస్‌, విక్రమ్‌గౌడ్‌, విజయ్‌, త్రిలోక్‌, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మున్నాసింగ్‌, కిట్టు, బాబ్జి, మహేశ్‌, దేవిరెడ్డి విజితారెడ్డి, అంజమ్మ, సునీత, లక్ష్మి, రుక్మిణి, జీహెచ్‌ఎంసీ డీఈ సంతోష్‌, ఏఈ ప్రేణ తదితరులు పాల్గొన్నారు.logo