శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:08:15

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

 నియోజకవర్గ అభివృద్ధికి కృషి

శేరిలింగంపల్లి  : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం డివిజన్‌ పరిధిలోని సెంట్రల్‌ పార్క్‌ ఫేజ్‌ -2 కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మాణ పనులను ఆయన శేరిలింగంపల్లి జోనల్‌ సిటీ ప్లానర్‌ ఏకే రెడ్డి, జీహెచ్‌ఎంసీ డీఈ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మిస్తుండడంతో ఎన్నో ఏండ్లుగా నెలకొన్న సమస్య తీరనున్నదని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మియాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, నాయకుడు కుమార్‌ పాల్గొన్నారు. 

గచ్చిబౌలి డివిజన్‌లో.. 

గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని నలగండ్ల ఫ్లై ఓవర్‌ కింద రూ.40 లక్షల వ్యయంతో కొనసాగుతున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ డీఈ శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. .  

 నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలి  

హఫీజ్‌పేట్‌ : నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఆయన హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని రామకృష్ణ నగర్‌లోని ఎన్‌ఎస్‌కేఎస్‌ కాలనీలోని నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్‌ సిటీ ప్లానర్‌ ఏకే రెడ్డి, మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, హఫీజ్‌పేట్‌ డివిజన్‌ అధ్యక్షుడు వాలా హరీశ్‌, కాలనీ వాసులు పాల్గొన్నారు. 


logo