ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 23, 2021 , 06:14:36

వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం

వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం

శామీర్‌పేట : రైతులు మూస పద్ధతిని విడనాడి వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని అప్పుడు ఆర్థికంగా పరిపుష్టి సాధ్యమవుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌, లాల్‌గడి మలక్‌పేటలోని రైతు వేదికలను శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరేండ్ల కింద ‘తెలంగాణ రైతాంగం చరిత్ర’ చూసినైట్లెతే చెట్లకు ఉరితాళ్లు, పురుగు మందులు సేవించిన రైతుల ఆత్మగోసలు మాత్రమే కనిపించేవన్నారు. పరాయి పాలనతో ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా సంక్షేమంలో రైతాంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజలకు తాగునీరు, సాగునీటితో పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రంలో కనీవినీ ఎరగని విధంగా రైతాంగానికి పెట్టుబడి కింద రైతుబంధు, రైతు కుటుంబానికి భరోసాగా రైతు బీమాలు అందిస్తున్నారన్నారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తూనే పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతాంగాన్ని సంఘటితం చేసి సమస్యల పరిష్కారం కోసం పంటల సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి, రైతును రాజుగా చూసేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి 5000ల ఎకరాలకు రైతులకు ఒక శాస్త్రవేత్త, ఇక ఇంజనీర్‌, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మేడ్చల్‌ పరిధిలోని రైతాంగం వాణిజ్య పంటలపైన పూలు, పండ్లు, కూరగాయ సాగుపై అవగాహన పెంచుకొని ఆ దిశగా సాగు చేసినప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వారికి సూచించారు.

అలియాబాద్‌లోని రైతు వేదికలో శామీర్‌పేట క్లస్టర్‌లో తూంకుంట మున్సిపాలిటీలోని గ్రామాలు, అలియాబాద్‌, శామీర్‌పేట, మజీద్‌పూర్‌ గ్రామాల్లో 3766 మంది రైతులకు గాను 6337 ఎకరాల సాగుభూమి ఉందన్నారు. లాల్‌గడి మలక్‌పేట క్లస్టర్‌ క్రింద లాల్‌గడి మలక్‌పేట, తుర్కపల్లి, యాడారం, మురహార్‌పల్లి, పొన్నాల్‌, బ్మొరాశిపేట గ్రామాల్లో 2856 మంది రైతులు, 6922 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంసన్‌, ఎంపీపీ ఎల్లూ బాయిబాబు, జడ్పీటీసీ అనితా లాలయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డీనేటర్‌ నారెడ్డి నందారెడ్డి, సొసైటీ చైర్మన్‌ మధూకర్‌రెడ్డి, మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సునీతలక్ష్మీ, మండల కో ఆర్డినేటర్‌ కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు గుర్క కుమార్‌ యాదవ్‌, చీదు వనజ శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుజాత, ఇందిరా రాజిరెడ్డి, అశోక్‌రెడ్డి, ఇందిరా, డీసీఎంఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ వంగ పెంటారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని మేరి రేఖ, సహాయ సంచాలకులు ఎన్‌.వెంకట్‌ రాంరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి అబ్దుల్‌ సత్తార్‌, తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీడీవో శశిరేఖ, మండల వ్యవసాయ అధికారి రమేశ్‌, ఏఈవో రవి యాదవ్‌, ఆత్మ అధికారి సంతోష్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ జహంగీర్‌, మండల అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తాళ్ళ జగదీశ్‌ గౌడ్‌, పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo