మలక్‌పేట : యువత ఉద్యోగ మేళాలను సద్వినియోగపరుచుకొని ఉపాధిని పొందాలని ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ రమేశ్ సూచించారు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం మలక్‌పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు. ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించాలన్నారు. కష్టపడితే దేనినైనా సాధించవచ్చునని తెలిపారు. ఉద్యోగ మేళాకు యువతులు పెద్ద సంఖ్యలో హాజరవటం అభినందనీయమని, జాబ్ మేళా కు వచ్చిన అందరు ఉద్యోగాలు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఆంగ్ల భాషను కమ్యూనికేషన్స్ కోసమే వాడాలని, మాతృ భాషలోనే మాట్లాడాలని సూచించా రు. అమ్మలాంటి మాతృభాషను ఎప్పుడూ మరువొద్దన్నా రు. అనంతరం, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ సుబ్బారావులు మాట్లాడుతూ, ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించిందని, యువతులు పెద్ద సంఖ్యలో హాజరవటం చాలా సంతోషకరమన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటం ద్వా రా బస్తీల్లో ఉండే యువతను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో ఈ మేళాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఉద్యోగ మేళాకు ఏ విధంగానైతే స్పందించారో, అదే విధంగా నేరా ల పట్ల కూడా యువతను అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఐ నాను నాయక్, ఎస్సైలు బాలరాజు, శ్రీనునాయక్, సుభాష్, వీరబాబు పాల్గొన్నారు.
మలక్‌పేట ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 700 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ‘ఫస్ట్ కాల్ టెలీ సర్వీసెస్’లో టెలీ కాలర్స్ పోస్టులు-75, హెచ్ఆర్హెచ్ నెక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-75, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో క్ల ర్క్-100, టీఎంఐ గ్రూప్‌లో ఏజెన్సీ మేనేజర్-20, రిక్రూటర్-2, సేల్స్ బ్రాంచ్ ఆఫీసర్-15, సేల్స్ ఆఫీసర్ సీఏఎస్ఏ-25, సేల్స్ ఆఫీసర్ కార్పొరేట్ సాలరీ-20, డాట్నెట్ డెవలపర్-5, యూ2మీ వర్క్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో హెచ్ఆర్ ఇంటర్న్-10, లారావెల్ డెవలపర్-5, మార్కెటింగ్ ఇంటర్న్స్-10, ఎస్‌క్యూల్ డెవలపర్-10, టెలీసేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు-150 పోస్టుల భర్తీకి గాను ఉద్యోగ మేళా నిర్వహించారు.
ఐదు సంస్థల్లో 522 పోస్టులకు గాను 1,229 మంది నిరుద్యోగ యువత మేళాలో నమోదు చేసుకోగా, వారిలో 547 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వివిధ సంస్థలు ఇంటర్వ్యూలు చేసి ప్రతిభ కలిగిన 224 మంది యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు.
ఇంతకు ముందు ఉద్యోగాల కోసం ఐప్లె చేయలేదు. కాని, ఇపుడు యూ2మీ వర్క్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో టెలీకాలర్‌గా ఉద్యోగం సంపాదించాను. ఒక సెక్యూర్ ప్లేస్ నుంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉంటుందోనని భయపడ్డాను. కాని, ఇక్కడికి వచ్చాక తెలిసింది కార్పొరేట్ కార్యాలయంగా ఉందని. నా జీవితంలో పోలీస్‌స్టేషన్‌కు రావటం ఇదే మొదటిసారి. పోలీస్‌ల ద్వారా ఉద్యోగాన్ని పొందటాన్ని చాలా సెక్యూర్‌గా భావిస్తున్నాను. – చందనా, బీటెక్, అమీర్‌పేట
ఇంత వరకు ఏ ఉద్యోగం కోసం ఐప్లె చేయలేదు. పోలీస్ స్టేషన్లో ఉద్యోగ మేళా పెట్టారని తెలుసుకొని వచ్చాను. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఉద్యోగాన్ని సాధించటం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు మున్ముందు మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉపయోగపడనుంది. పోలీసులు జాబ్ మేళాలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్‌స్టేషన్‌కు రావటం అంటే భయమేసేది. కాని, ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఫెండ్లీగా ఉంది. – నాగజ్యోతి, బీటెక్, సూర్యాపేట