e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home హైదరాబాద్‌ ఔటర్‌ కాలనీలకు జల సిరులు

ఔటర్‌ కాలనీలకు జల సిరులు

ఔటర్‌ కాలనీలకు జల సిరులు
  • కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సమృద్ధిగా నీటి సరఫరా
  • ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.250 కోట్ల కేటాయింపు
  • 2వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌, 70 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు

ఔటర్‌ రిం గు రోడ్డు లోపల మరో బృహత్తర తాగునీటి పథకం అమలు కు జలమండలి సన్నద్ధతున్నది. ఇప్పటికే పట్టణ భగీరథలో భాగంగా 190 గ్రామాల్లో దాహార్తికి శాశ్వత పరిష్కారంగా రూ.756 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 164 రిజర్వాయర్లు, 1400 కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ పనులను పూర్తి చేసి ఇంటింటికీ నల్లా ద్వారా సమృద్ధిగా నీరందిస్తున్నారు. ఈ ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 పథకం ద్వారా 1300 కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న 10 లక్షల మం దికి దాహార్తి తీర్చుతున్నది. ఈ నేపథ్యంలోనే శరవేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలలో హైరైజ్‌ బిల్డింగులు, గెటేడ్‌ కాలనీలు, విల్లాలు, భారీ అపార్ట్‌మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కాలనీలు/గేటెడ్‌ కమ్యూనిటీస్‌ 654లు కలిపి 1094 కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ, 11 సర్వీస్‌ రిజర్వాయర్ల నిర్మాణ పనులకు గానూ రూ.586.86 కోట్ల ప్రాజెక్టు పనుల డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను ప్రభుత్వానికి అందజేశారు.

తాజాగా, మినీ పట్టణాలుగా మారుతున్న 190 గ్రా మాల్లో భవిష్యత్తు రోజుల్లోనూ, నీరు సమృద్ధిగా అందించే ధ్యే యంతో మరో రూ.613.14 కోట్లు అవసరమని, తాజాగా జల మండలి ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పించింది. ఇందు లో భాగంగానే ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ఔటర్‌ గ్రామాలలో మెరుగైన నీటి సరఫరా కల్పనకు రూ.250 కోట్లు కేటాయించింది. మొత్తంగా, ఔటర్‌ ఫేజ్‌-2లో రూ.1200 కోట్లతో రెండువేల కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ పనులతో పా టు 130 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం గల కొత్తగా 70 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. త్వరలో ఈ ప్రాజె క్టు పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా, ఔటర్‌ గ్రామాలకు పుష్కలం గా గోదావరి జలాలను అందించి ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టనున్నారు.

కాలనీ, గెటేడ్‌ కమ్యూనిటీలకు సమృద్ధిగా నీరు

పన్నెండు మండలాల పరిధిలోని సుమారు 1094 కిలో మీటర్ల మార్గంలో నూతనంగా పైపులైన్లను ఏర్పాటుచేసి 654 కాలనీలు, గెటేడ్‌ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నారు. హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్‌నగర్‌, శామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూ ర్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాల పరిధిలో 1,094 కిలోమీటర్ల పరిధిలో వివిధ పరిమాణంలో తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసి గెటేడ్‌ కమ్యూనిటీలు, కాలనీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
ఔటర్‌ కాలనీలకు జల సిరులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement