e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ఉస్మానియా యూనివర్సిటీ, జూన్‌ 1: ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆసియా పసిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌ – లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు – 2021ను ఆయనకు ప్రకటించారు. అవార్డు ప్రదానం చేసే వేదిక, తేదీ వివరాలను త్వరలోనే తెలుపుతామని వారు సమాచారం అందజేశారు. టోంగా దేశానికి చెందిన కామన్‌వెల్త్‌ ఒకేషనల్‌ యూనివర్సిటీ, ఆసియా పసిఫిక్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండియా, బెల్గేవ్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గెరా – గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్స్‌ అలయెన్స్‌ సంస్థలు సంయుక్తంగా ప్రతీ ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అనంతరం ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థి నేతలు అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ట్రెండింగ్‌

Advertisement