గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Oct 29, 2020 , 08:42:33

డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల కోసం ఎవ్వరికీ పైసా ఇవ్వద్దు

డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల కోసం ఎవ్వరికీ పైసా ఇవ్వద్దు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • గోడేకిఖబర్‌లో లబ్ధిదారులకు ఇంటి ప్రతాల అందజేత

అబిడ్స్‌, అక్టోబర్‌ 28 (నమస్తే తెలంగాణ) : డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల కోసం ఎవ్వరికీ పైసా ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గం పరిధిలోని గోడేకిఖబర్‌లో నిర్మించిన 139 డబుల్‌ బెడ్రూం ఇండ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఒక్కొక్క ప్లాట్‌కు ప్రభుత్వం రూ.8.60 లక్షలు ఖర్చు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నదన్నారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌, కలెక్టర్‌ శ్వేతామహంతి, డీఆర్వో అనిల్‌, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌, ఈఈ వెంకటదాస్‌రెడ్డి, కార్పొరేటర్లు ముఖేష్‌సింగ్‌, పరమేశ్వరిసింగ్‌ పాల్గొన్నారు.