బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 23:57:25

అన్నం పెట్టి ఆదుకుంటున్నారు

అన్నం పెట్టి ఆదుకుంటున్నారు

  • శునకాల కష్టాలు తీరుస్తున్న దంపతులు

కవాడిగూడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, రోడ్డు పక్కన ఆకలితో అలమటించే వారి ఆకలి తీర్చేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కానీ వీధుల్లో తిరిగే శునకాలకు పట్టెడన్నం పెట్టేవారు లేక అవి బక్కచిక్కిపోతున్నాయి. దీంలో కవాడిగూడ భాగ్యలక్మీనగర్‌లో నివాసముంటున్న వల్లాల శ్యామ్‌యాదవ్‌, బాలమణి దంపతులు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన వీరు వీధుల్లో సంచరించే శునకాల దీనస్థితిని చూసి చలించిపోయారు. ప్రతిరోజు పది కిలోల బియ్యం, రెండు కిలోల చికెన్‌ వండి పెడుతూ వీధుల్లో శునకాలకు ఆకలి తీరుస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. 


logo