మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Hyderabad - Sep 16, 2020 , 01:18:42

డిప్యూటీ కమిషనర్‌కు గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌

డిప్యూటీ కమిషనర్‌కు గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సరూర్‌నగర్‌ డివిజన్‌ కమర్షియల్‌ టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి.వెంకటేశ్వర్లుకు కమర్షియల్‌ టాక్సెస్‌ ‘గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తెలంగాణ కమర్షియల్‌ టాక్సెస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పట్టణ వాస్తవ్యులైన ఆయన  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.ఎంఫిల్‌ పూర్తి చేశారు. ఒక వైపు వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నందుకు ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చినట్లు గ్లోబల్‌ హ్యూమన్‌  పీస్‌ యూనివర్సిటీ ప్రకటించింది. గౌరవ డాక్టరేట్‌ తన బాధ్యతను మరింత పెంచిందని డిప్యూటీ కమిషనర్‌ టి.వెంకటేశ్వర్లు అన్నారు.  


logo