సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు : సీపీ

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో శనివారం జరుగనున్న టీఆర్ఎస్ బహిరంగసభకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర మంత్రులతో కలిసి ఎల్బీస్టేడియంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ‘ఎల్బీస్టేడియం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం, వాహనదారులకు ఇబ్బందులు కల్గకుండా స్టేడియం పరిసరాలలో సభ జరిగే సమయంలో వాహనాలను దారి మళ్లిస్తున్నాం. సోషల్‌మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, పుకార్లు నమ్మొద్దు. ప్రశాంతతకు భంగం కల్గించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి’ అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సమీపంలో జరుగున్న బీజేపీ బహిరంగ సభకు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు
- ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి
- ప్రయాణికులకు డబుల్ ఖుషీ
- 28-01-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
- దేశ సంస్కృతిని చాటిచెప్పేలా..
- పీజీ చదివాడు.. అత్యాశకు పోయాడు