ఓయూ డిస్టెన్స్‌పై పుకార్లు నమ్మొద్దు

- అన్ని అనుమతులతోనే పీజీఆర్ఆర్సీడీఈ కోర్సులు
- ప్రతిష్టాత్మకంగా ఓయూ దూరవిద్యా కేంద్రం
- పుకార్లను విద్యార్థులు నమ్మొద్దు..
- ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 21: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో నిర్వహిస్తున్న కోర్సుల నిర్వహణకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డీఈబీ) అనుమతులు లేవని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల వివిధ యూనివర్సిటీలకు దూరవిద్య కోర్సులను నిర్వహించేందుకు యూజీసీ అనుమతులు మంజూరు చేసింది. ఏయే వర్సిటీలకు అనుమతులు ఇచ్చిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కాకతీయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల పేర్లు సైతం ఉన్నాయి. కానీ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఆ జాబితాలో లేదు. దీంతో పలు వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఓయూకు మూడేండ్ల పాటు దూరవిద్య కోర్సుల నిర్వహణకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు యూజీసీ ప్రకటించిందని పుకార్లు షికారు చేశాయి. కానీ సెంటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని, ఓయూ దూరవిద్యా కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని పీజీఆర్ఆర్సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.గణేశ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి ‘ఏ ప్లస్' గుర్తింపును న్యాక్ అందజేసిందని, దీంతో యూజీసీ కేటగిరీ - 1లో ఓయూకు చోటు లభించిందని గుర్తు చేశారు. కేటగిరీ - 1లో ఉన్న యూనివర్సిటీలు దూరవిద్యా కోర్సులను అందించేందుకు ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని వివరించారు. ఆ కేటగిరీలో లేని వర్సిటీలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
దూరవిద్యా కోర్సులకు అనుమతులు తప్పనిసరి
దూరవిద్యకేంద్రాలకు గుర్తింపు ఇచ్చే విధానం 2009లో ప్రారంభమైంది. దూరవిద్య అందించే యూనివర్సిటీలకు గుర్తింపు కల్పించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ఆధ్వర్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ)ను ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరంలోనే అన్ని యూనివర్సిటీలను డీఈసీ అధికారులు తనిఖీ చేసి, సరిగ్గా ఉన్న యూనివర్సిటీలకు గుర్తింపు మంజూరు చేశారు. అదేక్రమంలో పీజీఆర్ఆర్సీడీఈ కూడా అన్ని కోర్సులకు డీఈసీ గుర్తింపు పొందింది. 2012 -13 కాలంలో డీఈసీని డీఈబీగా మార్చి, దానిపై నియంత్రణాధికారం ఇగ్నో నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు కట్టబెట్టారు.
ఇప్పటికే ప్రక్రియ పూర్తి
ఓయూ దూరవిద్యా కోర్సులకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. కొంతమంది పీజీఆర్ఆర్సీడీఈ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేటగిరీ - 1 గుర్తింపు ఉన్న వర్సిటీలు ఎలాంటి అనుమతులు లేకుండా దూరవిద్య ద్వారా ఎన్ని కోర్సులైనా నిర్వహించవచ్చు. ఇప్పటికే సీడీఈ అందించే 24 కోర్సులకు సంబంధించిన వివరాలను యూజీసీకి పంపించాం. యూజీసీ అధికారులు దాన్ని ఆమోదించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -ప్రొఫెసర్ సీహెచ్. గణేశ్, డైరెక్టర్, పీజీఆర్ఆర్సీడీఈ
తాజావార్తలు
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్