బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 06:54:27

పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ షురూ

పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ షురూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీలో పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళవారం శిక్షణకు వచ్చిన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్లను అందించారు. 27న వెబ్‌క్యాస్టింగ్‌ వలంటీర్లు, 28న మైక్రో అబ్జర్వర్లకు పోస్టల్‌ బ్యాలెట్లను ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 9,238 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఒక్కో కేంద్రంలో పీవో, ఏపీవో సహా నలుగురు సిబ్బంది కలిపి మొత్తం 36,952 మంది పని చేయనున్నారు. 

3.7 లక్షల పత్రాలు సిద్ధం

ఎన్నికల అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు, వృద్ధులు, కొవిడ్‌ బాధితులకు ఎన్నికల సం ఘం 3.7 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లను సిద్ధం చేసింది.  3,70, 218 పోస్టల్‌ బ్యాలెట్ల ముద్రణ సోమవారం రాత్రి పూర్తయ్యింది. వచ్చే దరఖాస్తులను పరిశీలించి మొత్తం ఎంత మందికి పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చామనేది మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు.


logo