శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 22, 2021 , 08:02:36

నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్‌ సే’ వలంటీర్లు

నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్‌ సే’ వలంటీర్లు

హైదరాబాద్‌ : వ్యవస్థీకృత నేరాలు తగ్గినప్పటికీ.. ఆర్థిక నేరాలు, సైబర్‌ క్రైమ్‌లు 250 శాతం పెరిగాయి.. వీటిని అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, ఎండ్‌ నౌ సారధ్యంలో దేశంలోనే మొదటిసారిగా ‘దిల్‌ సే ’కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారు. డిజిటల్‌ లిటరసీ టూ సెక్యూర్‌ యూత్‌ నినాదంతో ఈ కార్యక్రమాన్ని గురువారం గచ్చిబౌలి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, యువతను సైబర్‌ వారియర్స్‌గా తీర్చిదిద్దడానికి నిర్వాహకులు శిక్షణ ఇస్తా రు.  దిల్‌ సే కార్యక్రమం ద్వారా ఇప్పుడు డిజిటల్‌ యుగంలో ఎలా జాగ్రత్తగా ఉండాలనే అంశాలను అందరీకి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేరాలనుకునేవారు crm<\@>scsc.in లేదా 9177283831ను సంప్రదించాలని ఎస్‌సీఎస్‌సీ, ఎండ్‌ నౌ సంస్థలు కోరుతున్నాయి. కార్యక్రమంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ  విజయ్‌కుమార్‌, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, ఎండ్‌ నౌ సంస్థ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లా, భరణీ అరోల్‌, అభిషేక్‌, వెంకట్‌ టంకశాల, సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌,  వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ దిల్‌ సే పోస్టర్‌ను ఆవిష్కరించారు.

VIDEOS

logo