సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 07:24:10

డిజిటల్‌ అగ్రికల్చర్‌..

డిజిటల్‌ అగ్రికల్చర్‌..

  • ఎల్‌వోఐలు కుదుర్చుకున్న పలు వర్సిటీలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (సీఐఐఈ), సావిత్రి బాయి ఫూలే పూణె విశ్వ విద్యాలయం (ఎస్పీపీయూ), ఐడియా ల్యాబ్స్‌ ప్యూచర్‌టెక్‌ వెంచర్స్‌ సోమవారం ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌తో డిజిటల్‌ అగ్రికల్చర్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు కోసం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ)పై సంతకం చేశాయి. ఈ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ)పై సావిత్రి బాయి ఫూలే పూణె యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ నితిన్‌ ఆర్‌ కర్మల్కర్‌, ఐడియా ల్యాబ్స్‌ ఫ్యూచర్‌టెక్‌ వెంచర్స్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ దివాన్‌ సంతకం చేశారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో డిజిటల్‌ అగ్రికల్చర్‌లో స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు.