e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ దందాలో ఎవరున్నా.. వదిలేది లేదు

దందాలో ఎవరున్నా.. వదిలేది లేదు

  • రూ.25లకు తక్కువగా లీటర్‌ డీజిల్‌
  • గతేడాదిగా జీహెచ్‌ఎంసీలో అక్రమ డీజిల్‌ దందా?
  • అక్రమ డీజిల్‌ను కొంటున్న క్రషర్‌, ఇండస్ట్రీస్‌ నిర్వాహకులు
  • బల్దియా అధికారులపై పోలీసుల ఆరా?

సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీ వాహనాలకు సంబంధించిన డీజిల్‌ దందా వెనకాల ఎవరున్నా వదిలే సమస్య లేదని రాచకొండ పోలీ సు అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. కోట్ల రూ పాయల్లో ప్రజాధనాన్ని దండుకున్న వారిని వదిలేదిలేదని, కేసును సీరియస్‌ తీసుకుంటున్నట్టు చెబుతున్నా రు. జీహెచ్‌ఎంసీ వాహనాలకు చెందిన డీజిల్‌ మార్కెట్‌లో రూ.25ల తక్కువ ధరకు దొరుకుతుంది. ఇలా డీ జిల్‌ను తక్కువ ధరకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరికైనా డీజిల్‌ తక్కువ ధరకు కా వాలంటే మేము సరఫరా చేస్తామని కొంత మంది దొం గ వ్యాపారులు బాహాటంగా ప్రచారం చేసుకుంటున్నా రు. దీంతో డీజిల్‌ను వినియోగించుకుని దందాలను చే సే పరిశ్రమలు, క్రషర్‌ నిర్వాహకులు ఇలా తక్కువ ధర కు డీజిల్‌ దొరుకుతుండటంతో వారు భారీగా నిల్వలను ఉంచుకుంటున్నారు.

ఇలా కొంత మంది కాంట్రాక్టర్లు డబ్బు సంపాదన కోసం జీహెచ్‌ఎంసీ డబ్బును కొల్లగొడుతున్నారు. గతేడాదిగా ఇలా అక్రమ వ్యాపారం కొనసాగుతుండగా జీహెచ్‌ఎంసీ అధికారులకు మాత్రం ఖబ ర్‌ లేదు. చివరకు పోలీసులకు అందిన సమాచారంతో వారు ఆరు నెలల పాటు నిఘా పెట్టి బుధవారం ఈ అ క్రమ దందాను బయటపెట్టారు. విచారణలో కాంట్రాక్టర్లతో పాటు వారి అనుచరుల బాగోతం వెలుగులోకి వ చ్చింది. అయితే, ఇంత భారీగా డీజిల్‌ కుంభకోణం నడుస్తున్నా అధికారులకు ఇంత వరకు తెలియకపోవడం వె నకాల గల కారణాలపై రాచకొండ పోలీసులు దృష్టి సా రించారు. ఈ నేపథ్యంలో డీజిల్‌ కుంభకోణం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న అందరినీ విచారించాల ని పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -

గతేడాదిగా జీహెచ్‌ఎంసీ ఎన్ని వాహనాలకు కూపన్లను జారీ చేశారనే లెక్కలను కూడా ఆరా తీయనున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి ఈ కుంభకోణంపై సమాచారం ఉందా? ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనే అనుమానా లు పోలీసులు నివృత్తి చేసుకోనున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగంపై సీరియస్‌గా ఉన్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో దీని వెనకాల ఎవరున్నా వా రిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహరంలో పాత్రధారులుగా ఉన్న సబ్‌ కాంట్రాక్టర్‌ నాదెండ్ల కోటేశ్వరరావు, ఒత్త వేణు మాధవ్‌రావు, అనుగు సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌ అవైజ్‌, కొత్తూరు వెంకటయ్యలను అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana