గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 00:01:13

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

 అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

 కార్పొరేటర్‌తో కలిసి డివిజన్‌లో పర్యటించిన మంత్రి తలసాని

మారేడ్‌పల్లి : డివిజన్‌లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మోండా డివిజన్‌ పరిధి బండిమెట్‌లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్‌ ఆకుల రూప హరికృష్ణతో కలిసి పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను మంత్రి  పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న సీవరేజీ పనులతోపాటు సీసీ రోడ్ల నిర్మాణం పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నాలాలు, ఖాళీ ప్రదేశాల్లో ప్రజలు చెత్తను వేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ముకుంద్‌రెడ్డి, వాటర్‌వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ కృష్ణమోహన్‌, జీహెచ్‌ఎంసీ మెడికల్‌ ఆఫీసర్‌ రవీందర్‌గౌడ్‌, విద్యాసాగర్‌, స్కైలాబ్‌, నాగేందర్‌, శారద పాల్గొన్నారు. 


logo