బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 00:11:32

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

గోల్నాక : అంబర్‌పేట నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబర్‌పేట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ తదితర డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్త రహదారులు, ఫుట్‌పాత్‌ పనులు, పార్కుల సందరీకరణ తదితర అంశాలపై సూచనలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఈఈ ఆశాలత, డీఈలు సంతోష్‌, సుధాకర్‌, ఏఈ ప్రేరణ, అధికారులు ఫరీద్‌, వేణుగోపాల్‌రెడ్డి, జానకిరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo