సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:41:44

ఆదర్శ నియోజకవర్గం దిశగా అభివృద్ధి

 ఆదర్శ నియోజకవర్గం దిశగా అభివృద్ధి

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

వనస్థలిపురం : ఎల్బీనగర్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం మార్నింగ్‌ వాక్‌లో భాగంగా కలెక్షన్స్‌ ట్రాన్సోర్ట్‌ పాయింట్‌ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కేంద్రాన్ని సందర్శించి కాలనీ వాసులను అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కలెక్షన్‌ ట్రాన్సోర్ట్‌ పాయింట్‌ కేంద్రం వల్ల ఏ ఒక్కరూ భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆ కేంద్రం నుంచి చెత్తను ఇతర ప్రాంతాలకు తరలిస్తారని తెలిపారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటువంటి కేంద్రాలను ప్రజలు అర్థం చేసుకొని నిర్మించడానికి స్వాగతిస్తే హస్తినాపురం డివిజన్‌ అభివృద్ధికోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే కేంద్రం వెనుక ఉన్న స్కూల్‌ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్దగోడ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కాలనీలో నూతనంగా రెండు కమ్యూనిటీహాల్స్‌ను నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా భూపేశ్‌గుప్తా నగర్‌ శ్మశాన వాటికను పరిశీలించారు. ఇప్పుడు ఉన్న శ్మశాన వాటికతో పాటు మరో రెండు శ్మశాన వాటికలను సంపూర్ణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మశ్రీనివాస్‌నాయక్‌, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, కొప్పుల విఠల్‌రెడ్డి, చెరుకు సంగీతప్రశాంత్‌గౌడ్‌, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌కృష్ణ  పాల్గొన్నారు.

logo