గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Jul 09, 2020 , 00:12:28

అభివృద్ధే లక్ష్యం..

అభివృద్ధే లక్ష్యం..

ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ 

అంబర్‌పేట : కరోనా విస్తరిస్తున్న తరుణంలో కూడా అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నా రు. నల్లకుంట డివిజన్‌లోని గోల్నాక కల్లు కంపౌండ్‌ వద్ద రూ.15 లక్షలతో నిర్మిస్తున్న వీడీసీసీ రోడ్డు పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్లు కంపౌండ్‌ వద్ద రోడ్డు అధ్వానంగా మారడంతో నిధులు మంజూరు చేయించి వీడీసీపీ రోడ్డును నిర్మింపజేస్తున్నామని అన్నారు. కార్పొరేటర్‌ శ్రీదేవి మాట్టాడుతూ.. డివిజన్‌లోని అన్ని బస్తీల ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు గరిగంటి రమేశ్‌, కె. శ్యామ్‌ పాల్గొన్నారు.   


logo