మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:45:48

ఊపిరి పిల్చుకుంటున్న ముంపు ప్రాంతాలు

ఊపిరి పిల్చుకుంటున్న ముంపు ప్రాంతాలు

సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 24 : పది రోజుల పాటు కురిసిన వర్షాలకు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని నాలా పరివాహక ప్రాంత ప్రజలు పడ్డ అవస్థలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి వరద బాధితులను ఆదుకోవడంతో పాటు డిప్యూటీ స్పీకర్‌ తనవంతుగా వ్యక్తిగతంగా సహాయం అందించడంతో వరద బాధితులు ఇప్పుడిప్పుడే ఊపిరి పిల్చుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా బాధితుకులకు అండగా నిలిచారు. బాధితులు ఇంట్లోని వస్తువులకు మరమ్మతులు చేయించుకొని ఇప్పుడిప్పూడే ప్రజలు కుదుట పడుతున్నారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదురుకావొద్దని ఎన్నికోట్లు వెచ్చించి అభివృద్ధి జరిపినా రెండు దశాబ్దాల కాలంగా ఎప్పుడు కురవనంతగా భారీ వర్షాలు కురవడంతో తాత్కాలిక ఇబ్బందులు తప్పలేదు. 

జరిగిన అభివృద్ధి...

నాలా పరివాహక ప్రాంతాల్లో రూ. దాదాపు రూ. 10 కోట్లతో అభివృద్ధి చేశారు. కల్వర్టులను అభివృద్ధి చేయడంతో పాటు నాలాలను విస్తరించారు. గతంలో నాలాలోంచే టెలిఫోన్‌, వాటర్‌లైన్‌, డ్రైనేజీ పైపులైన్లు వెళుతుండేవి. వాటివల్ల నాలలో చెత్త నిలిచిపోయి నాలాలోంచి నీరు వెలుపలికి వచ్చి పరిసర ప్రాంతాలు నీట మునిగేవి. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ నాలాలోంచి వాటన్నిటిని తొలగించి ఇతర మార్గాల ద్వారా ఏర్పాటు చేయడం తో నాలుగేండ్లుగా వర్షాలు కురిసినప్పటికి వరదల కారణంగా నాలా పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందు లు కలుగలేదు. తాజాగా భారీ వర్షాలు కురవడంతో గతం లో పోల్చితే పదిశాతం ఇబ్బందులు పడక తప్పలేదు.

అధికారుల చొరవతో..

భారీ వర్షం కురిసినప్పటికీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అధికారులతో అత్యవసరంగా సమావేశం జరిపి తీసుకోవాల్సిన చర్యలు సూచించడంతో నాలా పరివాహక ప్రాంతాల్లోనే అధికారులతో పాటు ఉండడంతో నష్ట తీవ్రతను తగ్గించగలిగారు. అప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది అప్రమత్తమై వరదనీరు సాఫీగా వెళ్లడం కోసం చర్యలు తీసు కున్నారు. 

టీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రశంసలు..

వరదల కారణంగా రోడ్లు, ఇండ్లు జలమయ్యాయి. అంబర్‌నగర్‌లోని ఏకశిల వద్దకు ఇతర ప్రాంతాల నుంచి ద్విచక్ర, ఆటోలు కొట్టుకువచ్చాయి. నాలాకు అడ్డుగోడ లేకపోవడంతో స్థానికంగా ఒక నివాసం పూర్తిగా నీటిలో కొట్టుకుపోయింది. ఇంటి యజమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ తన సొంత నిధులు రూ. 1లక్ష సహయం చేశారు. అప్పటికప్పుడు నిత్యావసర సరుకులను తెప్పిం చి అందజేశారు. వర్షం కురిసి వరదలు పెద్ద ఎత్తున వస్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు అండగా నిలిచారు. ఒక ఇంటిలో భార్య, భర్త చిన్న పాప చిక్కుకోవడంతో వారిని టీఆర్‌ఎస్‌ నాయకుడు మందజగన్‌ కిటికి ఊచలు తొలగించి రక్షించారు. వరదనీటి పైపులైన్‌పై చెత్త చేరుకోవడంతో అక్కడే ఉండే సాయియాదవ్‌ ఇతర నా యకులు వాటిని తొలగించారు. వీడియోకాల్‌ ద్వారా డిప్యూటీ స్పీకర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచి సహకరించిన వారిని పద్మారావు ప్రశంసించారు. 

సికింద్రాబాద్‌ : ముంపు బాధితులను ఆదుకోవడంలో ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. మెట్టుగూడ డివిజన్‌లోని వరద ముంపు ప్రాంతాల్లోని వారికి రూ. 10వేలు పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడా ది కాలంలో కురిసే వర్షాలు కేవలం రెండు, మూడు రోజుల్లో కురిసిన కారణంగానే ప్రజా జీవితం అతలాకుతలంగా మారిందని, అయినప్పటికీ ప్రభుత్వం వర ద బాధితులకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పు డు అందజేస్తున్న నిధులే కాకుండా అవసరమైతే మరి న్ని నిధులు అందజేయడం కోసం కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ మోహన్‌రెడ్డి, కిషోర్‌గౌడ్‌ నేతలు పాల్గొన్నారు.

ముంపు బాధితులకు కొనసాగుతున్న నగదు పంపిణీ

ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వరీనగర్‌, అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌ కింద ఉన్న బస్తీలలో వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రూ. పదివేల నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఆయా ప్రాం తాల్లో బాధితులకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతీహరి నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు ప్రతిఒక్కరికీ నగదు అందే వరకు పంపిణీ కొనసాగుతుందని స్ప ష్టం చేశారు. సహాయం అందలేదని బాధితులు ఎవ రూ ఆందోళన చెందవద్దని సూచించారు.