బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:19:06

బాధితులకు అండగా ఉంటాం... డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

బాధితులకు అండగా ఉంటాం... డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌ : వరద బాధితులకు అండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అన్నారు. వరదల నివారణకు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీతాఫల్‌మండి డివిజన్‌లోని ముంపు ప్రాంత బాధితులకు రూ. 10వేల పరిహారాన్ని గురువారం అందజేశారు. రూ.10కోట్లు వెచ్చించి కల్వర్టులు, నాలాల విస్తరణ చేపట్టడంతో వరద ప్రభావం పెద్దగా చూపలేదని తెలిపారు. 20 ఏండ్ల క్రితం మాదిరిగా పది రోజులపాటు భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఇబ్బందులు తప్పలేదన్నారు. ఇప్పుడు అందజేస్తున్న నిధులే కాకుండా అవసరమైతే మరిన్ని నిధులు అందజేయడం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ మోహన్‌రెడ్డి, ముషీరాబాద్‌ తాసీల్దార్‌ జానకి, యూసీడీ ప్రాజెక్ట్‌ అధికారి బలరాం, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి, కార్పొరేటర్‌ హేమ, టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్‌, కిశోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.