బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 09:48:52

జైళ్ల శాఖ సంస్కరణలు అద్భుతం

జైళ్ల శాఖ సంస్కరణలు అద్భుతం

మాదన్నపేట : జైళ్ల శాఖలో సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సోమవారం జైళ్ల శాఖ మొదటి ైస్టెపెండరీ వార్డర్స్‌ పాసింగ్‌ ఔటింగ్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేదితో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిశ్రమలు, పెట్రోల్‌ బంకుల్లో గతేడాది రూ.500 కోట్ల వ్యాపారం జరిగిందని, రూ.20 కోట్ల లాభాలతో అద్భుమైన ఫలితాలు సాధించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జైళ్ల శాఖకు కూడా సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించారన్నారు. తన బాల్యంలో జైళ్ల శాఖ తయారు చేసిన కార్పెట్లు కొనుగోలు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఐజీ సైదయ్య, డీఐజీ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.