దావత్ వద్దు.. సేవే ముద్దు

- నెల జీతాల్లో కొంత అనాథలకు సాయం
- అవసరం ఎక్కడున్నా పయనం
కాలంతో పరుగెత్తే రోజులివి. చదువులు, ఉద్యోగాలు, ఉపాధి ఆలోచనలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితులు. డబ్బులుంటే సినిమాలు, షికార్లు, దోస్తులతో దావత్ అంటూ ఎంజాయ్ చేస్తారు కొంతమంది. కానీ ఉన్నదాంట్లో దాచుకొని అనాథలకు సేవచేయాలని సంకల్పించారు ఆ యువకులు. ఇల్లు గడవడం కష్టమైనా నెల జీతంలో కొంత సేవ కోసం కూడబెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ‘నియర్ వన్ డియర్ వన్' ప్రతినిధులు.
సేవ కోసమే ఒక్కటైన చేతులు
తుర్కపల్లిలోని సాయిసైన్స్ లిమిటెడ్ కంపెనీలో కాంట్రాక్ట్ బేస్‌లో నెలకు కేవలం రూ.9వేల జీతాలు తీసుకుంటున్నారు పలువురు యువకులు. నెల జీతంలో కొంత దాచిపెట్టుకొని మూడు నాలుగు నెలలకోసారి సరదాగా దేవాలయాలు, దూరప్రాంతాలకు వెళ్తూ ఎంజాయ్ చేసేవారు. ఓ రోజు అనాథలకు సేవ చేయాలని సంకల్పిచారు. సరదాల కోసం దాచుకున్న డబ్బులను పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలని దీక్ష బూనారు. 10 మందితో ప్రారంభమైన వీరి ప్రయాణం 25 మంది సభ్యులతో ‘నియర్ వన్ డియర్ వన్' సంస్థగా మారింది. సంస్థ ద్వారా ప్రతి నెలా ఒకరోజు అనాథ, వృద్ధాశ్రామాల్లోని పేదల కడుపునింపుతున్నారు.
అదృష్టంగా భావిస్తున్నాం
అనాథలకు బుక్కెడు బువ్వ పెట్టే అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. 2016లో తుర్కపల్లి అనాథ ఆశ్రమంలో పిల్లలను చూసి నాటి నుంచి ఎలాగైనా వాళ్లకు సహాయం చేయాలనుకున్నా. కానీ అప్పుడు మా జీతం రూ.9 వేలు. వచ్చిన జీతం ఇంటి కిరాయి, సరుకులకు సరిపోయేది కాదు. అయినా అనాథలకు ఏం చేయలేకపోతున్నామనే ఆలోచన కలచివేసింది. నా ఆలోచనను స్నేహితులతో పంచుకున్నా. ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఎక్కడ పేదలు ఆకలితో అలమటించినా మేమున్నామంటూ ముందుకెళ్తున్నాం. - కొండల్‌రెడ్డి, డియర్ వన్ నియర్ వన్ వ్యవస్థాపకుడు
తాజావార్తలు
- చిరు సాంగ్‌కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
- కొవిడ్ టీకా తీసుకున్న డీఎంకే అధ్యక్షుడు
- అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. పీపీఈ కిట్‌లో అనుమానితుడు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్‌హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్‌కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే