బుధవారం 08 జూలై 2020
Hyderabad - May 31, 2020 , 03:01:36

ఆస్తిపన్ను రాయితీకి నేటితో గడువు పూర్తి

ఆస్తిపన్ను రాయితీకి నేటితో గడువు పూర్తి

హైదరాబాద్ : ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ కల్పించే ఎర్లీబర్డ్‌ ఆఫర్‌కు మే 31వ తేదీతో గడువు పూర్తవుతున్నది. 31న ఆదివారం అయినప్పటికీ ఆస్తిపన్ను  చెల్లించవచ్చని, అంతేకాకుండా మీ-సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ పౌరసేవా కేంద్రాలు సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ లేదా  బిల్‌ కలెక్టర్లకు నేరుగా పన్నులు చెల్లించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, శనివారం వరకు రూ. 486 కోట్ల మేర పన్ను వసూలైనట్లు వారు వివరించారు.


logo