మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 06:13:18

సైబర్‌ మోసాల నియంత్రణకు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్ వెబినార్‌

సైబర్‌ మోసాల నియంత్రణకు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్ వెబినార్‌

సైబర్‌ మోసాల నియంత్రణకు వెబినార్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేసుబుక్‌, ఇన్‌స్టాగ్రాం వేదికగా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మంగళవారం వెబినార్‌ నిర్వహించారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం నుంచి జరిగిన వెబినార్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం నోడల్‌ అధికారి సత్యయాదవ్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీసీపీ క్రైమ్స్‌ రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ క్రైమ్స్‌ కవిత, ఏసీపీ శ్యాంబాబు, హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, రాచకొండ ఏసీపీ హరినాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫేసుబుక్‌, ఇన్‌స్టాగ్రాం ద్వారా జరుగుతున్న నేరాల గురించి పోలీసు అధికారులు వివరించారు. రాజకీయ, మతపరమైన పోస్టింగ్‌లపై నియంత్రణ పెట్టాలన్నారు. అభ్యంతరాలు, అశ్లీల పోస్టులను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. 24/7 పోలీసులకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం నోడల్‌ అధికారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పోలీసుల విజ్ఞప్తికి నోడల్‌ అధికారులు సానుకూలంగా స్పందించారు. సైబర్‌ క్రైం పట్ల అవగాహన కల్పించడంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలు భాగస్వాములు కావాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.


logo