మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 07:29:23

పుకార్లపై సైబర్‌ నిఘా..!

పుకార్లపై సైబర్‌ నిఘా..!

  • సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారం 
  • అలర్ట్‌ అయిన పోలీసులు
  • ఎన్నికలకు మూడు కమిషనరెట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు
  • సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా..
  • సీసీసీ నుంచి పర్యవేక్షణ..
  • ఓటర్లను భయపెట్టినా, ప్రలోభపెట్టినా డయల్‌ 100..
  • డబ్బులు పంచినా, అల్లర్లు సృష్టించినా చర్యలు ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నకిలీ వార్తలతో పుకార్లు సృష్టించడం.. ఒకరిపై మరొకరు లేనిపోని అబద్దాలతో వీడియోలు, ఫొటోలతో సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు అవకాశముండటంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  సోషల్‌ మీడియాపై నిరంతరం నిఘా  ఉంటుందని.. ఎవరైనా రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పె ట్టినా, ఆడియోలు, వీడియోలను షేర్‌చేసినా కఠిన చర్య లు  తప్పవని  మూడు కమిషనరేట్ల సీపీలు హెచ్చరించారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల రోజు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీవీ9 పేరుతో నకిలీ బ్రేకింగ్‌ను సృష్టించి.. దానిని సోషల్‌మీడియాలో ప్రచారం చేసి, ఓటర్లను అయోమయానికి గురిచేశారు. దీనిపై సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు టీవీ9 ప్రతినిధులు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా.. మంగళవారం జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో కూడా కొన్ని జాతీయ పార్టీలు ఈ కుట్రలకు పాల్పడే అవకాశాలున్నాయి. 

ఆయా డివిజన్లలోని తమ ప్రత్యర్థులపై సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ బురద జల్లెందుకు కుతంత్రాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా సీఎం ఫొటోనే మార్ఫింగ్‌ చేసి.. సోషల్‌మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టువు ఆయిన ఓటును తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సైబర్‌క్రైం పోలీసులు అంతటా నిఘా పెట్టారు. ఉదయం 6 గంటల నుంచే సైబర్‌క్రైమ్‌ పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. ఎవరైనా నకిలీ వార్తను ప్రచారం చేసి, పుకార్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే.. అది నకిలీదని అనుమానం రాగానే వెంటనే  సైబర్‌క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలి... బాధ్యత గల పౌరులుగా వాటిని ఇతరులకు పంపించకుండా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సూచించారు. అలాంటి పుకార్లను నమ్మొద్దని, ఏమైనా ఉంటే వెంటనే డయల్‌ 100కు గానీ, నేరుగా  ఫోన్‌: 9490616152 కు గానీ సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు. 

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 22 వేల మందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో పక్క.. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పోలీసులు పర్యవేక్షించ నున్నా రు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గితే వెంట నే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ నుంచి  పరిశీలించి.. తగిన చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ స ర్వం సిద్ధం చేసింది. ప్రజలు ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కును  ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

రాచకొండ  పరిధిలో..

రాచకొండ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సోమవారం సీపీ మహేశ్‌ భగవత్‌  పర్యటించి బందోబస్తును పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి అందరూ బా ధ్యతగా ఓటు వేయాలని సూచించారు. హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బంజారా బస్తీ, రంగనాయకుల గుట్ట ప్రాంతాల్లోని ప్రజలతో సీపీ మాట్లాడారు. ఓటర్లను భయపెట్టినా, ప్రలోభపెట్టినా వెంటనే డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ నం:9490617111 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. 

సైబరాబాద్‌   పరిధిలో...

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 13,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీసీ సజ్జనార్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతం గా జరిగేలా.. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.  సోమవారం కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీ స్‌స్టేషన్‌ల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలను సీపీ పరిశీలించారు. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీలో కేంద్ర, అదనపు బలగాలతో నిర్వహించిన పోలీసు కవాతులో సీపీ,  మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌,  ఏసీపీలు సు రేందర్‌రావు, లక్ష్మీనారాయణ, కిషోర్‌ కుమార్‌,  సీఐలు లక్ష్మీనారాయణ, నరసింగరావు పాల్గొన్నారు.