శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 21, 2020 , 01:06:34

ట్రాక్టర్‌ కోసం వెళ్లి..1.54లక్షలు పోగొట్టుకున్నాడు

ట్రాక్టర్‌ కోసం వెళ్లి..1.54లక్షలు పోగొట్టుకున్నాడు

హైదరాబాద్‌: ఓ రైతు.. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ కొందామని సోషల్‌ మీడియాలో ప్రకటనను చూసి.. సైబర్‌ నేరగాళ్లవలలో చిక్కి రూ.1.54లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే...  నగరానికి చెందిన ఓ రైతు సెకండ్‌ హ్యాండ్‌ ట్రాక్టర్‌ కొనాలని భావించాడు.  ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఓ ట్రాక్టర్‌ అమ్మకానికి సంబంధించిన ప్రకటన చూసి.. అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించాడు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పిన ధరకు ఆ రైతు ఒకే అని.. రూ1.54 లక్షలు వారు సూచించిన ఖాతాల్లో వేశాడు. ఆ తర్వాత రైతు ఫోన్‌ చేసినా సమాధానం లేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు నగర సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 డెబిట్‌ కార్డు క్లోనింగ్‌.. 50 వేలు డ్రా

హైదరాబాద్‌కు చెందిన ఓ గ్రాఫిక్‌ డిజైనర్‌కు చెందిన డెబిట్‌ కార్డు క్లోనింగ్‌కు గురైంది. కొంత కాలంగా అతను నగరంలోనే ఉన్నా.. అతని డెబిట్‌ కార్డుతో బీహార్‌ రాష్ట్రం గయలో రూ.50 వేలు డ్రా చేశారు. దీనికి సంబంధించిన సమాచారం డిజైనర్‌కు రాగా.. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు. గయలోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి డ్రా చేసినట్లు గుర్తించా రు. దీంతో బాధితుడు బుధవారం నగర సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  


logo