మంగళవారం 26 మే 2020
Hyderabad - May 20, 2020 , 01:39:18

రూ.6.42లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

రూ.6.42లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్ : మాస్కుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యాపారికి రూ.50వేలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీకి చెందిన ఓ వ్యాపారి ఓఎల్‌ఎక్స్‌లో ఎన్‌-95 మాస్కుల విక్రయ ప్రకటన చూసి.. అందులోని నంబర్‌కు ఫోన్‌ చేశా డు. తాము పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాం తానికి చెందిన లోక్‌నాథ్‌ ఫ్యాషన్‌ అనే సంస్థకు చెందిన వారమని, రూ.200కు ఒక మాస్కు చొప్పున 500 మాస్కులు పంపించేందుకు సిద్ధమంటూ ఒప్పందం చేసుకున్నారు.  అడ్వాన్స్‌గా  రూ.50వేలు వసూలు చేశారు. తరువాత మరో రూ. 30 వేలు కావాలంటూ డిమాండ్‌ చేశారు. సరుకు వచ్చిన తరువాత ఇస్తానంటూ బాధితుడు చెప్ప గా.. వారు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో.. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు అబిడ్స్‌ ప్రాం తానికి చెందిన ఓ వ్యక్తికి గత ఆగస్టులో ఫోన్‌ చే శారు. అతను వారి మాటలు నమ్మి రెండు ప్లాట్ల కు రూ.4.5లక్షలు చెల్లించాడు. రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. 

 ఇంకో ఘటనలో.. సైదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లోయాక్టివా ఫైవ్‌జీ వాహనాన్ని కొనేందుకు సిద్ధమయ్యాడు. అందు లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయగా.. అతన్ని మా ట ల్లో పెట్టి సైబర్‌నేరగాళ్లు రూ.49 వేలు కాజేశారు. 

అలాగే పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ట్రూప్‌బజార్‌కు చెందిన వ్యక్తికి రూ. 93 వేలు టోకరా వేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo