e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home క్రైమ్‌ ఆన్‌లైన్‌లో కరోనా మందులు

ఆన్‌లైన్‌లో కరోనా మందులు

ఆన్‌లైన్‌లో కరోనా మందులు

సిటీబ్యూరో, జూన్‌ 24(నమస్తే తెలంగాణ): చార్మినార్‌లో నివాసముండే ఓ వ్యక్తి హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ సంస్థ వద్ద ఇటొలిజుమబ్‌, టోస్లిజుమబ్‌ ఇంజక్షన్లను, ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేశాడు. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ రాకేశ్‌ ప్రసాద్‌ కండేల్‌వాల్‌ పేరుతో సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసి, తమ వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటూ సంస్థ పేరు చెప్పారు. డబ్బు చెల్లిస్తే మూడు గంటల్లో ఇంజక్షన్లను మీకు పంపిస్తామని.. రూ. 1,80,774 ముందుగా చెల్లించాలంటూ సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ఆ డబ్బును ఆమ్జద్‌ఖాన్‌ పేరుతో ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. ఆ తరువాత వారు ఫోన్లు స్విచాఫ్‌ చేశారు. గుంటూరులో ఉన్న బాధితుడి మామ కొవిడ్‌తో దవాఖానలో చికిత్స పొందుతుండగా… ఆయనకు అత్యవసరమైన మందులు కావాలనే ఉద్దేశ్యంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. చెప్పిన సమయానికి మందులు సరఫరా కాకపోవడంతో బాధితుడి మేనమామ కొవిడ్‌తో మృతి చెందాడు. దీనిపై బాధతుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై నరేందర్‌రెడ్డి బృందం దర్యాప్తు చేపట్టింది. కెమరూన్‌ దేశానికి చెందిన జఫ్‌ డిక్లేన్‌, టాంజానియాకు చెందిన మత్యాస్‌ షాలు బెంగుళూర్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆన్‌లైన్‌లో కరోనా మందులు
ఆన్‌లైన్‌లో కరోనా మందులు
ఆన్‌లైన్‌లో కరోనా మందులు

ట్రెండింగ్‌

Advertisement