శనివారం 08 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 23:49:07

భద్రంగా రోడ్డు దాటేలా..

భద్రంగా రోడ్డు దాటేలా..

36 పాదచారుల వంతెనలు

కొన్నింటికి ఎస్కలేటర్లు కూడా 

14చోట్ల పనులు ప్రారంభం

ఏడాది చివరికల్లా పూర్తిచేయాలన్నది లక్ష్యం

 సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: రద్దీగా ఉన్న రోడ్లపై మరింత భద్రంగా రోడ్లు దాటేందుకు హైదరాబాద్‌ మహానగర పురపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మరిన్ని పాదచారుల వంతెన(ఎఫ్‌ఓబీ)లను నిర్మించనుంది. 36 ప్రాంతాలను అందుకోసం ఎంపిక చేసింది. అధికారులు ఇప్పటికే 25 ఎఫ్‌ఓబీల నమూనాలు రూపొందించి 14 ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు.ఇందులో కొన్నింటికి ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎఫ్‌ఓబీల నిర్మాణానికి ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం   గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే 36 ప్రాంతాల్లో నిర్మించనున్న ఎఫ్‌ఓబీల పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు నాలుగు ప్యాకేజీల కింద విభజించారు. వీటి నిర్మాణానికి రూ.83.13 కోట్లు.. జీఎస్టీతో కలుపుకొని మొత్తం రూ.100 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే జోన్ల వారీగా పరిశీలిస్తే ఎల్బీనగర్‌లో 10, చార్మినార్‌-5, ఖైరతాబాద్‌-4, సికింద్రాబాద్‌-5, శేరిలింగంపల్లి-10, కూకట్‌పల్లి-2 మొత్తం 36 ఎఫ్‌ఓబీలను నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో శేరిలింగంపల్లిలో ఎనిమిది ఎఫ్‌ఓబీలకు డిజైన్లు ఖరారు కాగా, సికింద్రాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌లో నాలుగు చొప్పున, కూకట్‌పల్లిలో రెండు ఎఫ్‌ఓబీలకు డిజైన్లు పూర్తిచేశారు. ఇందులో సికింద్రాబాద్‌లో నాలుగు, ఎల్బీనగర్‌, చార్మినార్‌ జోన్లలో మూడేసి, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో రెండేసి మొత్తం 14 ఎఫ్‌ఓబీల పనులు మొదలయ్యాయి.

ప్రమాదాలు జరగకుండా 

నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం పాదచారులేనని రోడ్డు దాటే క్రమంలో మరణిస్తున్నట్టు నగర ట్రాఫిక్‌ పోలీసులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఆ శాఖ జీహెచ్‌ఎంసీకి ఓ నివేదిక సమర్పించింది. ఇందులో భాగంగా మొదటి దశలో 52 చోట్ల ఎఫ్‌ఓబీలు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌  38ల చోట్ల ఎఫ్‌వోబీలకు సమ్మతి తెలిపింది. ఇందుకనుగుణంగా ప్రభుత్వం 38 ఎఫ్‌ఓబీల నిర్మాణానికి బల్దియా పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కాగా, చార్మినార్‌ జోన్‌లో రెండు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలతో రెండు ఎఫ్‌ఓబీలు మాత్రమే నిర్మించే వీలుందని గుర్తించారు. దీంతో ఎఫ్‌ఓబీల సంఖ్య 36కు పరిమితమైంది.

జోన్లవారీగా ఎఫ్‌ఓబీలు, వాటి వ్యయం

ప్యాకేజీ జోన్‌ ఎఫ్‌ఓబీలు వ్యయం(కోట్లు)

1 ఎల్బీనగర్‌ 10 16.56

 2 చార్మినార్‌ 5 16.54

3 ఖైరతాబాద్‌,సికింద్రాబాద్‌ 9 21.33

 4 శేరిలింగంపల్లి,కూకట్‌పలి 12 28.68

మొత్తం 36 83.13

ప్యాకేజీల వారీగా ఎఫ్‌ఓబీలు నిర్మిస్తున్న ప్రాంతాలు.. 

 ఎల్బీనగర్‌ జోన్‌(ప్యాకేజీ-1) 

1.చక్రిపురం క్రాస్‌రోడ్స్‌-

   నాగారం విలేజ్‌

2. హెచ్‌పీఎస్‌- రామంతాపూర్‌ 

3. నోమా ఫంక్షన్‌హాల్‌-మల్లాపూర్‌  

4. సాయిసుధీర్‌ కాలేజ్‌-ఏఎస్‌రావు నగర్‌

5. ఎస్‌బీఐ-హబ్సిగూడ

6. సుష్మా థియేటర్‌-వనస్థలిపురం

7.దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌, 

8. కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ 

9.సరూర్‌నగర్‌ స్టేడియం

10.వర్డ్‌ అండ్‌ డీడ్‌ స్కూల్‌-

     హయత్‌నగర్‌

 చార్మినార్‌ జోన్‌ (ప్యాకేజీ-2)


11. స్వప్న థియేటర్‌-రాజేంద్రనగర్‌

12. షాహ థియేటర్‌- గణేశ్‌నగర్‌

13. బండ్లగూడ సన్‌సిటీ

      (ఎస్కలేటర్‌తో)

14. సీబీఎస్‌ టూ ఎంజీబీఎస్‌

     (ఎస్కలేటర్‌తో)

15. ఓమర్‌ వైద్యశాల-షాలిమార్‌ హోటల్‌

16. దుర్గానగర్‌ టీ జంక్షన్‌ హెరిటేజ్‌ పారియర్‌(ఎస్కలేటర్‌తో)

17. ఓల్డ్‌ కర్నూల్‌ టీ జంక్షన్‌- 

     ఉందానగర్‌(ఎస్కలేటర్‌తో)

(వీటిలో ఐదు మాత్రమే సాధ్యం)

 ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్‌లు

(ప్యాకేజీ-3) 

18.ఆరె మైసమ్మ టెంపుల్‌-లంగర్‌హౌస్‌ (ఎస్కలేటర్‌తో)

19. షేక్‌పేట్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌-గెలాక్సీ, 

20.జీవీకే వన్‌ - బంజారాహిల్స్‌(ఎస్కలేటర్‌తో)

21. హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌ - పంజాగుట

     (ఎస్కలేటర్‌తో)

22. హిమాయత్‌నగర్‌ క్రాస్‌రోడ్‌ - నారాయణగూడ ఫ్లైఓవర్‌

23. నేరేడ్‌మెట్‌ బస్టాప్‌

24.గాంధీ దవాఖాన-ముషీరాబాద్‌(ఎస్కలేటర్‌తో)

25. సెయింట్‌ యాన్స్‌ స్కూల్‌- తార్నాక

26. సెయింట్‌ యాన్స్‌ స్కూల్‌-సికింద్రాబాద్‌(ఎస్కలేటర్‌తో) 


కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్‌లు(ప్యాకేజీ-4)

27. బాలానగర్‌-ఎన్‌ఎస్‌కేకే స్కూల్‌

28. రంగాభుజంగ థియేటర్‌-షాపూర్‌నగర్‌(ఎస్కలేటర్‌తో)

29. ఈఎస్‌ఐ దవాఖాన, మారుతీ సుజుకీ-ఎర్రగడ్డ(ఎస్కలేటర్‌తో)

30.సాంటా మేరీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌-ఆదర్శ్‌నగర్‌

31. ఐడీబీఐ-గచ్చిబౌలి 

32.భాను టౌన్‌షిప్‌- మియాపూర్‌

33. సైబర్‌ గేట్‌వే- హైటెక్‌సిటీ(ఎస్కలేటర్‌తో) 

34. టెలికాం నగర్‌-గచ్చిబౌలి(ఎస్కలేటర్‌తో)

35.చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌- మదీనగూడ (ఎస్కలేటర్‌తో)

36.విజేత సూపర్‌మార్కెట్‌-చందానగర్‌(ఎస్కలేటర్‌తో)

37. ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌- మియాపూర్‌(ఎస్కలేటర్‌తో)

38. ఇందిరానగర్‌-గచ్చిబౌలి


logo