e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home క్రైమ్‌ కరోనా సోకిన నిందితుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు

కరోనా సోకిన నిందితుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు

కరోనా సోకిన నిందితుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు
  • పీపీఈ కిట్‌ తొడిగించి.. న్యాయస్థానంలో హాజరు
  • అరెస్టు సమయంలో కొవిడ్‌ పరీక్షలు
  • పాజిటివ్‌ వస్తే పీపీఈ కిట్‌ ధరింపజేసి
  • తొలుత కోర్టుకు..ఆ తర్వాత దవాఖానకు

ముఖ్యమైన, తీవ్రమైన ఘటనల్లో.. నేరస్తులను పట్టుకునేందుకు, న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు నగర పోలీసులు వెనకాడడం లేదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో..పట్టుబడిన నిందితులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినా రాకున్నా.. కొవిడ్‌ రక్షణ సూత్రాలను అనుసరిస్తూ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత దవాఖానకు తరలిస్తున్నారు.

పాజిటివ్‌ రాకున్నా.. నిబంధనలు తప్పనిసరి..

  • నిందితుడిని పట్టుబడిన వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.
  • నెగెటివ్‌ వచ్చినా, పాజిటివ్‌ వచ్చినా కొవిడ్‌ సూత్రాలను అనుసరిస్తున్నారు.
  • పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చినప్పుడు నిందితుడు ఉండే ప్రాంతంలో పూర్తిగా శానిటైజేషన్‌ చేయడంతో పాటు మాస్కులు ఇస్తున్నారు.
  • భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
  • ఆ తర్వాత పీపీఈ కిట్‌ ధరింపజేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు.
  • న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే ముందు పాజిటివ్‌ వచ్చిన వారిని దవాఖానకు తరలిస్తున్నారు.

పాజిటివ్‌ వచ్చినా.. కశ్మీర్‌ ముఠా అరెస్టు

ఇటీవల కాశ్మీర్‌లో కాల్పులకు పాల్పడి తప్పించుకుని మహబూబ్‌నగర్‌కు వచ్చి దాచుకున్న గ్యాంగ్‌స్టార్‌ను అరెస్టు చేసే క్రమంలో కూడా నిందితులకు కరోనా సోకింది. పోలీసులు ముందు వారిని పట్టుకుని కరోనా పరీక్షలు చేయించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. కశ్మీర్‌ పోలీసులకు నిందితులను అప్పగించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా సోకిన నిందితుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు

ట్రెండింగ్‌

Advertisement