‘గ్రేటర్'లో 49 మందికి నేరచరిత

- అత్యధికంగా 17 మంది బీజేపీ అభ్యర్థులపై కేసులు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 49 మంది నేర చరిత్ర కలిగి ఉన్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బుధవారం విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. 150 డివిజన్లలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి 627 మంది పోటీ చేస్తుండగా.. వీరిలో 49 మందిపై 96 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అత్యధికంగా బీజేపీ నుంచి 17 మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులుండగా, కాంగ్రెస్ నుంచి 12, టీఆర్ఎస్ నుంచి 13, ఎంఐఎం నుంచి ఏడుగురు ఉన్నారు. కేసుల సంఖ్య పరంగా చూస్తే బీజేపీ అభ్యర్థులపై 36 కేసులు ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థులపై 26, ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థులపై 17 చొప్పున నమోదయ్యాయి. మొత్తం 41 డివిజన్లలో నేరచరిత్ర కలిగిన వారు పోటీలో ఉన్నారు. జీహెచ్ఎంసీకి జరిగిన గత ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల నుంచి 72 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు పోటీ చేయగా, వారి సంఖ్య ఈసారి 49కి తగ్గడం శుభ పరిణామమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొన్నది.