గురువారం 04 మార్చి 2021
Hyderabad - Dec 17, 2020 , 02:18:09

నేరాలు తగ్గుతున్నాయ్‌..

నేరాలు తగ్గుతున్నాయ్‌..

 మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తగ్గిన నేరాలు 

 కాలనీలు, వ్యాపార సముదాయంలో 7800 సీసీ కెమెరాలు 

మాదాపూర్‌, డిసెంబర్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంపై ప్రత్యేక నిఘాను పెట్టి నేరాలను అదుపు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పోలీస్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటు శాంతి భద్రతల పరిరక్షణకు దిశానిర్ధేశాలు చేస్తు పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేయడంతో పోలీసులు మేము సైతం అంటు సమస్యాత్మక ప్రాంతాలపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ నేరాలను అదుపు చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు.  

గతంలోనే అధికం..  

మాదాపూర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా నేత్రాలను అధికంగా ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో గత మూడు సంవత్సరాలుగా నేరాలు అదుపులోకి వచ్చాయి. ఇందులో భాగంగా 2018లో 662 కేసులు నమోదు కాగా, 2019లో 647 కేసులు, 2020లో 447 కేసులు నమోదయ్యాయి.


మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో సీసీ కెమెరాలు 

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు ఓ వైపు కాలనీ ప్రతినిధులు, మరోవైపు నేను సైతంలో భాగంగా పబ్లిక్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు, కిరాణషాపులు, హోటల్‌, మాల్స్‌ కలిపి 7800 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో కాలనీ ప్రతినిధులు మొత్తం 340 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగా సెక్టార్‌1 కి చెందిన కాకతీయహిల్స్‌ కాలనీలో 7 సీసీ కెమెరాలు, సాయినగర్‌, సెక్టార్‌ 2కి చెందిన అయ్యప్పసొసైటీలో 9 సీసీ కెమెరాలు, సెక్టార్‌ 3కి చెందిన చందానాయక్‌తండాలో 18 సీసీ కెమెరాలు, సెక్టార్‌4 కి చెందిన హెచ్‌ఐసీసీ, ఇజ్జత్‌నగర్‌, కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయం సమీపంలో కలిపి 119 సీసీ కెమెరాలు, సెక్టార్‌5కి చెందిన సిద్ధిక్‌నగర్‌లో 8 సీసీ కెమెరాలు, సెక్టార్‌ 6కి చెందిన కుమ్మరి బస్తీలో 55 సీసీ కెమెరాలు, మస్తాన్‌నగర్‌, సెక్టార్‌ 7కి చెందిన ఆంధ్రాబస్తీలో 124 సీసీ కెమెరాలు ఉండగా నేనుసైతం (పబ్లిక్‌ సేప్టీ)లో భాగంగా 7460 సీసీ కెమెరాలను ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా కొత్తగా మరో 540 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా త్వరలో వినియోగంలోకి రానున్నట్లు పోలీసులు తెలిపారు.

నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణలో.. 

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో నిరంతరం నిఘా ఉంచడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఐటీ హబ్‌గా పేరొందిన మాదాపూర్‌లో ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టాం. దోపిడీలు, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఆయా సెక్టార్లపై దృష్టి పెడుతు నేరాల అదుపుకు కృషి చేస్తున్నాం.  

 - రవీంద్ర ప్రసాద్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ 


VIDEOS

logo